twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు వర్సెస్ బాలయ్య .... ఈ కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం ఎందుకో?

    |

    మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నాకు తెలిసిన బాలయ్య ఒక్కరే, ఆయన బాగా కామెడీ చేస్తారు అంటూ సీనియర్ కమెడియన్ బాలయ్య ఫోటోను చూపి మరీ ఓ వీడియో పోస్టు చేశారు నాగబాబు.

    నాగబాబు నుంచి ఆ కామెంట్స్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఇరు వర్గాలకు చెందిన అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ కల్పించుకుని వారికి ఆపే ప్రయత్నం చేశారు.

     నాగబాబు చెప్పింది నిజం కాదు

    నాగబాబు చెప్పింది నిజం కాదు

    నాగబాబుగారు... బాలకృష్ణగారిని నాకు తెలియదు పొమ్మనడం రెండు మూడు రోజుల నుంచి బాగా ట్రెండింగులో ఉంది. తనకు తెలిసిన బాలయ్య ఈయనే అంటూ ఎవరినో చూపిస్తున్నారు. మరి ఆయన సరదాగా అన్నారో? ఎందుకు అన్నారో తెలియదు. నిన్నగాక మొన్నే ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎస్వీ రంగారావు పాత్ర ఆయన వేశారని పేపర్లో వచ్చింది. బాలకృష్ణ ఆయనకు తెలియదు అనడం నిజం కాదు. బాలకృష్ణ, చిరంజీవి ఫ్యామిలీస్ కూడా చాలా క్లోజ్.... అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

    వాళ్లు వాళ్లు బానే ఉంటారు

    వాళ్లు వాళ్లు బానే ఉంటారు

    నాగబాబు తెలియదు అని ఎందుకు చెప్పారు అనేది వదిలేస్తే... వాళ్లంతా బాగానే ఉన్నారు. ఏదో సరదాగా కామెడీ చేసుకుంటారు. మనం ఎందుకు టెన్షన్ పడాలి. ఫ్యాన్స్ అంతా కొట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? ఏదో కొంప మునిగిపోయినట్లు ప్రవర్తించడం ఎందుకు? తెలియదు అన్నంత మాత్రాన మనకు పోయిందేటి? దానికి మనం గింజుకోవాల్సిన అవసరం లేదు... అని తమ్మారెడ్డి సూచించారు.

     కులాల వారిగా, పార్టీల వారిగా విడిపోయి ఎందుకిలా?

    కులాల వారిగా, పార్టీల వారిగా విడిపోయి ఎందుకిలా?

    చిరంజీవి, బాలకృష్ణ గారు మాత్రమే కాదు... ఇండస్ట్రీలో అందరు హీరోలు చాలా బావుంటారు. కానీ అనవసరంగా మనం వర్గాలైపోయి, కులాలైపోయి.... హీరోల వారిగా విడిపోయి, పార్టీల వారిగా విడిపోయి తిట్టుకోవాల్సిన అవసరం అభిమానులకు లేదు. నేనూ ఒకప్పుడు ఎన్టీఆర్ అభిమానినే.

    మనం ఎంత వరకు ఉండాలంటే

    మనం ఎంత వరకు ఉండాలంటే

    మనం ఎంత వరకు ఉండాలంటే... మనం నమ్మిన, ఇష్టపడ్డ హీరోను అభిమానించే వరకు, ఆ సినిమా చూడటం వరకు మాత్రమే ఉండాలి. అంతే కానీ మిగతా వాటికి పట్టించుకుని సమయాన్ని, డబ్బులు వేస్ట్ చేసుకుంటూ కల్చర్ లెస్ గా ఒకరినొకరు తిట్టుకోవడం సరైన పని కాదు.

     తల్లిదండ్రులు చదువు చెప్పించేది బూతులు తిట్టుకోవడానికా?

    తల్లిదండ్రులు చదువు చెప్పించేది బూతులు తిట్టుకోవడానికా?

    సమాజంలో మనిషి పుట్టాడంటే ఏదో ఒక పని చేయడానికి పుడతారు. తిట్టుకోవడానికి కాదు. ఈ ట్విట్టర్, ఫేస్ బుక్ వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. మన తల్లిదండ్రులు చదువు చెప్పించేది బూతులు తిట్టుకోవడానికి కాదు కదా...కల్చర్ పెరుగుతున్న కొద్దీ మన సంస్కారం పెరగాలి. పరమ చండాలమైన బూతులు తిట్టుకుంటూ మనం బ్రతుకుతున్నాం. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం.

    English summary
    Tammareddy Bharadwaj Reacts on Naga Babu Over Comments on Balakrishna. Nagababu Vs Balayya. Naga Babu, younger brother of Chiranjeevi got trolled for saying that he doesn't know who Balakrishna is. Finally, he says this remark has caused a stir between fans of Balayya and Chiranjeevi on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X