మా హీరోలు, మా కలెక్షన్ల గురించి మీకెందుకు?.... మీరు చంపుతామంటే భయపడేంత సీన్ లేదు!

Recommended Video

Tammareddy Bharadwaja Sensational Comments On Fans

ఒకప్పుడు దర్శకుడిగా, నిర్మాతగా తన సత్తాచాటిన సీనియర్ టాలీవుడ్ పర్సన్ తమ్మారెడ్డి భరద్వాజ.... ఈ మధ్య యూట్యూబ్ వీడియోలతో హాట్ టాపిక్ అవుతున్నారు. 'నా ఆలోచన' పేరుతో తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయాలు, సినిమా అంశాలు, నేషనల్ పాలిటిక్స్, మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

వర్దమాన అంశాలపై ఆయన మాట్లాడే తీరు ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆయన యూట్యూబ్ ఛానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు లక్ష ఉందంటే తమ్మారెడ్డి చెప్పే విషయాలను ఎంత మంది ఆసక్తిగా పరిశీలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

తమ్మారెడ్డికి బెదిరింపులు

తమ్మారెడ్డికి బెదిరింపులు

అయితే ఈ మధ్య కాలంలో ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ మీద తమ్మారెడ్డి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కొందరికి కోపం తెప్పిస్తున్నాయట. తనను చంపుతామని బెదరిస్తున్నారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

సినిమా వాడివి నీకేం తెలుసురా...

సినిమా వాడివి నీకేం తెలుసురా...

ఈ మధ్య ఏదైనా మాట్లాడాలంటే భయంమేస్తోంది. కొంత మంది చంపేస్తాం అంటున్నారు. కొంత మంది నువ్వు సినిమా వాడివి నీకేం తెలుసురా.. అంటున్నారు. సెంట్రల్ ఇంటలిజెన్స్‌కు తెలియనివి కూడా నీకు తెలిసి పోతున్నాయా? నువ్వు అంత పుడింగివా? అంటూ బెదిరిస్తున్నారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

 చంపుతామంటే భయపడేంత సీన్ లేదు

చంపుతామంటే భయపడేంత సీన్ లేదు

సెంట్రల్ ఇంటలిజెన్స్‌కు తెలియదు అనేది వీళ్లకెలా తెలుసు? మాకు తెలియంది భరద్వాజకు తెలిసిందని సెంట్రల్ ఇంటిలిజెన్స్ వారు చెప్పారా? చంపేస్తాం అంటున్నారు.... అందరూ ఎప్పుడైనా చనిపోయేవాళ్లమే.., ఈ రోజు కాక పోతే రేపు చస్తాం. వాళ్లు చంపుతామంటే నేను భయపడేంత సీన్ లేదు ఇక్కడ అని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.

మా హీరోలు, మా కలెక్షన్ల గురించి మీకెందుకు?

మా హీరోలు, మా కలెక్షన్ల గురించి మీకెందుకు?

సినిమా వాడివిరా నువ్వు ఇవన్నీ నీకెందుకు... నీ పని నువ్వు చూసుకోవచ్చుగా అంటున్నారు. సరే నేను నా పని చూసుకుంటా... మరి మీరేంటి? మా సినిమా కలెక్షన్ల గురించి, మా హీరోలు హీరోయిన్లు ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్లారు? అవన్నీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అవన్నీ మీరు మానేస్తారా? ప్రతిదీ మీకే కావాలి.... మా సినిమా కలెక్షన్లు మీకే కావాలి, ఏ సినిమా హిట్టా?, ఏ సినిమా ఫట్టా? అన్నీ మీకే కావాలి.... అంటూ తనదైన శైలిలో తమ్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఎవరి గురించి?

ఏ డైరెక్టర్ అయిపోయాడు, ఏ హీరోయి అయిపోయాడు, ఏ హీరోయిన్ అయిపోయింది.... అంటూ ఆరా తీస్తున్నారు. అసలు ఎవరైనా అయిపోతారని మీరెలా అనుకుంటారు? యూట్యూబుల్లో మీరు పెట్టేవన్నీ బోగస్. అది ప్రపంచం అందికీ తెలుసు. అటువంటి మీరు నన్ను ఇన్నేసి మాటలు అనొచ్చా? అనే హక్కు మీకుందా? మీకు హక్కు ఉన్నపుడు మాకెందు ఉండదు.... అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. అయితే తమ్మారెడ్డి ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X