twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కుట్ర నేనే చేశా, కృష్ణ ఫ్యాన్స్ దాడి చేశారు..... దాసరితో గొడవ పడాల్సి వచ్చింది: తమ్మారెడ్డి

    By Bojja Kumar
    |

    Recommended Video

    Tammareddy Bharadwaj Makes Sensational Comments On Hero Krishna

    తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సీనియర్లలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చిరంజీవితో మద్రాసుతో కలిసి తిరిగిన తమ్మారెడ్డి... ఇటు దాసరి వద్ద కూడా శిష్యరికం చేశారు. ఇండస్ట్రీలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా అందులో తమ్మారెడ్డి కాంట్రిబ్యూషన్ ఉంటుంంది. అలాగే పరిశ్రమలో జరిగే మంచి, చెడు విషయంలో తనదైన అభిప్రాయాలు వెల్లడిస్తూ తప్పులు జరిగితే ఎత్తి చూపడంలో, మంచి విషయాలను ప్రోత్సహించడంలో ముందుంటారు. తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    సూపర్ స్టార్ కృష్ణతో గొడవ గురించి

    సూపర్ స్టార్ కృష్ణతో గొడవ గురించి

    సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అప్పట్లో 'రౌడీ అన్నయ్య' సినిమాకు తమ్మారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విషయంలో హీరో కృష్ణతో జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు. ఈ సినిమా క్లైమాక్స్ సాంగ్ సిల్క్ స్మితతో చేశాం. ఈ పాట విషయంలోనే తమ మధ్య విబేధాలు వచ్చాయి అని తెలిపారు. "బాబూ మోహన్‌తో చేసే ఆ సాంగ్‌లో కృష్ణగారు కనిపించకూడదని నేను అనుకున్నాను. కానీ హీరో లేకుంటే ఎలా, నేను ఉండాల్సిందే అని కృష్ణ గారు పట్టుబట్టారు అని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

    కృష్ణ గారికి తెలియకుండా బాబు మోహన్‌తో చేశాం

    కృష్ణ గారికి తెలియకుండా బాబు మోహన్‌తో చేశాం

    దీంతో కృష్ణగారి మాట కాదనలేక పగలు ఆయనతో చేస్తూనే.... సాయంత్రం ఆయనకు తెలియకుండా బాబుమోహన్ సాంగ్ చిత్రీకరించాం. సెన్సార్ సయమంలో ఆ పాట విషయంలో కృష్ణ గారి పేరు లేకుండా బాబు మోహన్ పేరు ఉండేలా నేనే కుట్ర చేశాను. అయితే ఆ సాంగ్‌పై సెన్సార్ వారు అభ్యంతరం చెబుతూ దాన్ని తీసేయాలని చెప్పడంతో కృష్ణగారు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ రివైజింగ్ కమిటీ మెంబర్‌గా సుబ్బిరామిరెడ్డి గారు ఉన్నారు. ఆయన స్వయంగా లోనికి తీసుకెళ్లి కృష్ణగారికి ఆ సాంగ్ చూపించారు. అప్పుడు ఆయనకు నిజం తెలిసిపోయింది. కోపంతో బయటకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మన ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పారు అని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

    అభిమానులు మా ఆఫీసుపై దాడులు చేశారు

    అభిమానులు మా ఆఫీసుపై దాడులు చేశారు

    ఈ విషయం అభిమానులకు తెలిసి నా ఆఫీసు మీద దాడులు చేశారు. దీంతో నేను వారిపై కేసులు పెట్టాను. చాలా కాలం కృష్ణగారితో నాకు మాటల్లేవు. ఒకసారి ఆయనే పిలిచి అభిమానులపై కేసులు ఎత్తేయమని చెప్పారు. అప్పటి నుండి మళ్లీ కలిసిపోయాం అని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

     దాసరి చాలా క్లోజ్‌గా ఉండేవారు, ఆయనతోనూ గొడవ తప్పలేదు

    దాసరి చాలా క్లోజ్‌గా ఉండేవారు, ఆయనతోనూ గొడవ తప్పలేదు

    నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుండే దాసరి గారంటే ఇష్టం. ఆయన వద్ద శిష్యరికం చేశాను. తన దగ్గరికి ఏ కథ వచ్చినా ముందుగా నాకు చెప్పేవారు. సినిమా అయిన తర్వాత రషెస్ చూపించేవారు. ఓసారి ఆయన పిలిపించి రేలంగి నరసింహారావును దర్శకుడిని చేయాలనుకుంటున్నాను .. కథ రెడీ చేయి అని చెప్పడంతో అలాగే చేశాను. కష్టపడి కథ రెడీ చేసిన తర్వాత కథ బాగోలేదని చెప్పారు. తర్వాత జరిగిన పరిణామాలతో చాలా పెద్ద గొడవ జరిగింది అని తమ్మారెడ్డి అన్నారు.

    ఆ సినిమా విషయంలోనే గొడవ

    ఆ సినిమా విషయంలోనే గొడవ

    "కథ .. మాటలు రెడీ చేసి, రేలంగి నరసింహారావుకు ఇచ్చాను. ఆయన బెంగుళూర్ వెళ్లి అక్కడ షూటింగులో దాసరికి వినిపించారు. దాసరిగారు కథ నచ్చలేదని చెప్పడంతో నేను స్వయంగా గురువుగారిని కలవడానికి వెళ్లాను. షూటింగ్ బిజీ వల్ల ఆయన్ను కలవడం వీలు కాలేదు. దీంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. అయితే అదే కథను అదే టైటిల్ తో నాకు చెప్పకుండా వేరేవారితో దాసరి మొదలు పెట్టారు. దీంతో నాకు కోపం వచ్చి మీడియాకెక్కాను, సినీ హెరాల్డ్ అనే పత్రికలో దాసరి గారు ఇలా చేశారని చెప్పాను. పేపర్ చూసిన దాసరి నన్ను పిలిపించారు అని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

     దాసరిగారి ఇంట్లోనే సెటిల్మెంట్

    దాసరిగారి ఇంట్లోనే సెటిల్మెంట్

    దాసరిగారు ఇంటికి పిలిపించారు. నన్ను ఎందుకు ఇలా పేపర్లో అల్లరి చేశావ్ అని అడిగారు. మీరు నాకు చెప్పకుండా సినిమా ఎందుకు చేశారు అని నేను అన్నాను. చివరకు ఆయన అయింది ఏదో అయిపోయింది అంటూ సమస్యను సెటిల్ చేశారు. మళ్లీ ఆ తర్వాత ఇద్దరం మామూలుగా ఉండటం మొదలు పెట్టారు. ఇటీవల ఆయన పరమపదించే వరకు నాతో చాలా బాగా ఉండే వారు అని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

    English summary
    Tammareddy Bharadwaj Remembered his Controversies with Krishna and Dasari at Ali's tv show. Tammreddy Bharadwaja is an Indian film producer and director. He is one of the successful Telugu film producers. He is the son of veteran producer Tammareddy Krishna Murthy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X