సైరా కలెక్షన్లపై తమ్మారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. మండిపడుతున్న మెగాఫ్యాన్స్
Recommended Video
తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే మెగా ఫ్యాన్స్ కు కాస్త కోపమెక్కువే. చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మెగాభిమానులకు అతనంటే పడదు. అయితే అలాంటి వ్యక్తి సైరాపై, కలెక్షన్లపై మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇక ఈ వీడియోపై మెగాభిమానులు మండిపడుతున్నారు.

గతంలో అమ్మడు కుమ్ముడు సాంగ్ పై..
ఖైదీ నెంబర్.150 సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ పై తమ్మారెడ్డి ధ్వజమెత్తారు. అలాంటి గొప్ప స్థాయిలో ఉన్న చిరంజీవి అమ్మడు కుమ్ముడు ఏంటి? అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి వివాదం క్రియేట్ చేశారు. ఇక దీనిపై అప్పట్లో మెగాఫ్యాన్స్ ఆయనపై విరుచుకుపడ్డారు.

తాజాగా సైరాపై..
తమ్మారెడ్డి ఏదైనా విషయం గురించి మాట్లాడితే చాలా సుదీర్ఘంగా మాట్లాడుతాడు. అయితే సైరాపై కేవలం 1.53 నిమిషాల్లో తేల్చేశారు. అక్కడే అతని ఉద్దేశ్యం ఏంటన్నది అర్థమైపోతోందని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తీవ్ర పదజాలంతో తమ్మారెడ్డిని ఏకిపారేస్తున్నారు.

సాహో, బాహుబలితో పోలుస్తూ..
సాహో, బాహుబలి కలెక్షన్లతో పోలుస్తూ.. 300కోట్లు, 500కోట్లు, వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు అంటూ సైరా కలెక్షన్ల గురించి మాట్లాడాడు. అయితే ఈ సినిమాలోన చిరు నటన, సాంకేతిక నిపుణులు, సినిమా కథ, కథనం ఇలా వేటిగురించి ప్రస్థావించకుండా.. కేవలం కలెక్షన్ల గురించే మాట్లాడాడు.

కలెక్షన్ల కోసం కాదు.. గౌరవం కోసం...
ఈ మూవీ రెండు వేల కోట్లను కూడా కలెక్ట్ చేస్తుందేమో చూడాలన్న తమ్మారెడ్డి మాటల్లో ద్వంద్వార్థం కనబడుతోందని మెగాభిమానులు ఫైర్ అవుతున్నారు. మీకున్న ఈ కుళ్లే మెగాస్టార్ కు రక్ష అంటూ తమ్మారెడ్డిని తిట్టిపోస్తున్నారు. అయినా సినిమా గురించి, చిరు నటన గురించి మాట్లాడకుండా.. కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నప్పుడే నీ మనసులో ఉన్న ఉద్దేశ్యం బయట పడిందని అంటున్నారు. అయినా సైరాలో చూడాల్సింది కలెక్షన్లు కాదు.. ఎంత గౌరవాన్ని తీసుకొస్తుందన్నది చూడాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి వీటిపై తమ్మారెడ్డి ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











