twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లో మాట్లాడని బూతులు సినిమాలోనా? మన సినిమా ఎక్కడికెళుతోంది?

    |

    Recommended Video

    Tammareddy Bharadwaj Bold Statements About Latest Telugu Movies | Filmibeat Telugu

    వరల్డ్ థియేటర్ డే(మార్చి 27) సందర్భంగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినిమా రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు కళలు మంచిని బోధించే సాధనాలుగా ఉండేవి. సినిమా వచ్చాక అన్ని కళల వన్నె తగ్గింది. చివరకు ఇదే సినిమా చెడును బోధించే సాధనంగా తయారయింది అంటూ తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

    తెలుగు సంస్కృతిలో కళలు శతాబ్దాలుగా భాగమై ఉన్నాయి. తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, హరికథలు, యక్షగానాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి నుంచే నాటకాలు, నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఏది మంచి, ఏది చెడు అనేది వివరిస్తూ ప్రజలను మంచి మార్గంలో నడిపించేవి. 1960, 1970 వరకు సినిమాల్లో మంచి ఉండది... కానీ క్రమక్రమంగా సినిమా చెడిపోతోందని తెలిపారు.

    రాను రాను సినిమా మారిపోతోంది

    రాను రాను సినిమా మారిపోతోంది

    మనం బ్రిటిష్ పాలనలో ఉన్నపుడు స్వతంత్ర్య పోరాటానికి సపోర్ట్ చేస్తూ మంచి సినిమాలు వచ్చేవి. మనకు ఉన్న దురాచారాలను రూపుమాపే లక్ష్యంతో మరికొన్ని సినిమాలు వచ్చేవి. రైతు అభివృద్ధి గురించి, మహిళ సాధికారత గురించిన కథలు తెరపై చూశాం. రాను రాను పరిస్థితి పూర్తిగా మారిపోతోందని తమ్మారెడ్డి తెలిపారు.

    ఇంట్లో కూడా మాట్లాడని బూతులు సినిమాల్లో...

    ఇంట్లో కూడా మాట్లాడని బూతులు సినిమాల్లో...

    ఇప్పుడు వచ్చే సినిమాలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. అమ్మాయిలను ఎలా ఏడిపించవచ్చు, ఎలా ఎక్స్‌ప్లాయిడ్ చేయొచ్చు లాంటి అంశాలతో ఉంటున్నాయి. టైటిల్స్ కూడా అలాగే పెడుతున్నారు. ఇంట్లో కూడా మాట్లాడని బూతులు ఈ రోజు సినిమాల్లో ఉంటున్నాయి.

    రాంచరణ్, కేటీఆర్ మధ్య పవర్‌స్టార్ చిచ్చు.. పవన్ కల్యాణ్‌తో మెగా హీరోలకు ఇబ్బందులు!రాంచరణ్, కేటీఆర్ మధ్య పవర్‌స్టార్ చిచ్చు.. పవన్ కల్యాణ్‌తో మెగా హీరోలకు ఇబ్బందులు!

    వల్గారిటీ బూతులు ఎక్కువయ్యాయి

    వల్గారిటీ బూతులు ఎక్కువయ్యాయి

    ఇలా చేయడం వల్ల మనం సినిమాను ఎక్కడికి తీసుకెళుతున్నాం? వరల్డ్ థియేటర్ డే రోజున ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే... ఈ థియేటర్, ఈ కళలు మన సంస్కృతిని ఇంతకాలం కాపాడాయి. మనకు మంచి అలవాట్లు అబ్బేవిధంగా దోహదం చేశాయి. కానీ ఇప్పుడు సినిమాల్లో వల్గారిటీ, బూతులు ఎక్కువయ్యాయని తమ్మారెడ్డి తెలిపారు.

    సమాజాన్ని వక్రమార్గంలోకి నెట్టేలా సినిమా

    సమాజాన్ని వక్రమార్గంలోకి నెట్టేలా సినిమా

    మనం సినిమా ద్వారా ఏం బెతున్నామో? ఎలాంటి సందేశం ఇవ్వాలకుంటున్నామో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. కొన్ని సినిమాలైతే సమాజాన్ని వక్రమార్గంలోకి తీసుకెళుతున్నాయి. లంచగొండితనం తప్పు అనే రోజుల నుంచి అందరూ తింటున్నారు కదా మనం తింటే తప్పేంటి? అనే పిచ్చి ఆలోచనలోకి వచ్చాం. ఇలా చాలా విషయాల్లో సినిమా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

    English summary
    Tollywood Veterean Director Tammareddy Bharadwaj Shares His Happiness on World Theatre Day. He says, It's #WorldTheatreDay! We are proud to be the home to so many theatres that showcase national and global talent daily. Share with us your memories and show our theatres some love!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X