twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ... 4 రూపాయలు ఎవడు తినాలి? దాసరి ఉంటే ప్రశ్నించేవాడు!

    తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్ చేశారు. టాలీవుడ్ పరిశ్రమలో థియేటర్ల కబ్జాపై గళమెత్తారు.

    By Bojja Kumar
    |

    అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న థియేటర్ల కబ్జా దందాను వేలెత్తి చూపారు. కొందరు బడా నిర్మాతల కారణంగా చిన్న సినిమా బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు ఉండి ఉంటే దీని గురురించి ప్రశ్నించే వారన్నారు.

    అర్జున్ రెడ్డి సినిమా కోసం డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో చాలా కష్టపడ్డాడు. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తయారవుతున్నాయి. కానీ అన్నీ 'అర్జున్ రెడ్డి' కావు, 'పెళ్లి చూపులు' మాదిరిగా అదృష్టం రాదు. చాలా సినిమాలు మరుగున పడిపోతున్నాయని తెలిపారు.

    థియేటర్లు వారి కబ్జాలో ఉన్నయి

    థియేటర్లు వారి కబ్జాలో ఉన్నయి

    ఎందుకు మరుగున పడిపోతున్నాయి అంటే థియేటర్లు లేవు అంటారు, ఇంకోటి అంటారు. ఎందుకు లేవు? థియేటర్లు ఉన్నాయి.... కానీ మనకి రావు. ఎందుకంటే అవి కొంత మంది కబ్జాలోన్నాయని తమ్మారెడ్డి అన్నారు.

    Recommended Video

    Vijay Deverakonda Making Fun @Arjun Reddy Theatrical Trailer Launch
    వాటి గురించి మాట్లాడేది ఎవరు?

    వాటి గురించి మాట్లాడేది ఎవరు?

    ఇపుడు జీఎస్టీ వచ్చింది. జీఎస్టీ వచ్చాక... ‘అర్జున్ రెడ్డి' ఇంత క్రేజ్ ఉన్నా కూడా పెళ్లి చూపులకంటే 20% తక్కువ చేస్తుంది. ఎందుకంటే జీఎస్టీ రూపంలో 20% ఎక్కువ టాక్స్ పడుతుంది. వాటన్నింటి గురించి మాట్లాడేది ఎవరు? వచ్చే థియేటర్స్‌లో రెంట్స్ తీసుకునేది ఎవరు? ప్రొడ్యూసర్ కు వచ్చే పైసలు ఎన్ని? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

    3, 4 రూపాయలు ఎవరు తినాలి?

    3, 4 రూపాయలు ఎవరు తినాలి?

    ఇపుడు ‘అర్జున్ రెడ్డి' నిర్మాతగానీ, హీరోగానీ, డైరెక్టర్ గానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. రేపు ఎంత పైసలు వస్తాయి? సూపర్ హిట్ అని మనం చెబుతాం. ఆహా ఓహో అంటాం. జీఎస్టీతో పాటు ఇతర టాక్సులన్నీ పోను 20 రూపాయల టికెట్లో మిగిలేది 6 రూపాయలు. ఇందులో 50% లేదా 25 % థియేటర్ వాడికి వెలుతుంది. ఇందులో మనకు వచ్చేది ఎంత? 3 రూపాయలు లేదా 4 రూపాయలు... ఈ పైసలు ఎవరు తినాలి? అంటూ..... నిర్మాతకు ఏమీ మిగలడం లేదనే విషయాన్ని గుర్తు చేశారు తమ్మారెడ్డి.

    అర్జున్ రెడ్డి లక్కీ

    అర్జున్ రెడ్డి లక్కీ

    ‘అర్జున్ రెడ్డి' సినిమా రాత్రింభవళ్లు ఇంత కష్టపడి సినిమా తీశారు. లక్కీగా సునీల్ నారంగ్ కొన్నాడు కాబట్టి వీళ్లు బయట పడ్డారు. లేకపోతే ఈ అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యేది కాదు.... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    దాసరి ఉంటే మాట్లాడేవారు

    దాసరి ఉంటే మాట్లాడేవారు

    ఇటువంటి కష్టాలు అన్నీ లేకుండా ఉండాలంటే సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి ఉండాలి. ‘అర్జున్ రెడ్డి' సినిమా ఫంక్షన్‌కు నేను మాట్లాడే దానికి సంబంధం లేక పోయినా దీని ద్వారా ఈ మెసేజ్ ఇండస్ట్రీకి వెలుతుందని మీ టైమ్ వేస్టు చేస్తున్నాను సారీ. అపార్థం చేసుకోవద్దు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దాసరి నారాయణరావుగారు ఉండి ఉంటే ఈ విషయాలన్నీ మాట్లాడి ఉండేవారు. ఆయన లేరు కాబట్టి, ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి, ఎప్పుడో అప్పుడు బయటకు రావాలి కాబట్టి, నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇది మాట్లాడాను.... అని తమ్మారెడ్డి తెలిపారు.

    English summary
    Tammareddy Bharadwaj speech about GST effect on Tollywood at Arjun Reddy pre release function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X