twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా తిట్టాను, చిరంజీవిపై ద్వేషం లేదు, ఒక్కమాట అంటే ఫ్యాన్స్ తిరగబడతారు: తమ్మారెడ్డి

    దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    By Bojja Kumar
    |

    చిరంజీవి నటించిన 'కోతలరాయుడు' మూవీ ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా తన కెరీర్ మొదలు పెట్టారు. అప్పట్లో తమ్మారెడ్డి, చిరంజీవి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కానీ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి స్పందించారు.

    చిరంజీవిగారు అంటే... గారితో ఇపుడు అంత రిలేషన్ షిప్ లేదు. చిరంజీవితో చాలా రిలేషన్ షిప్ ఉంది. చిరంజీవి, నేను చెప్పుకుంటూ పోతే మా ఇద్దరికీ ఎన్ని గంటలు చెప్పినా చాలదు... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    అలా అనుకుంటారు, అందుకే చెప్పను

    అలా అనుకుంటారు, అందుకే చెప్పను

    చిరంజీవికి, నాకు మధ్య చాలా రిలేషన్ షిప్ ఉంది. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఇపుడు చెబితే వీడు అపుడు తిట్టి చిరంజీవికి దగ్గరవ్వడానికి ఇపుడు ఇలా చెప్పాడు అనుకుంటారు. అందుకే వాటిని ఇపుడు బయటకు చెప్పదలుచుకోలేదు.... అని తమ్మారెడ్డి అన్నారు.

    చిరంజీవికి డబ్బులు ఇవ్వలేదు

    చిరంజీవికి డబ్బులు ఇవ్వలేదు

    మా ఇద్దరికీ చాలా చాలా మంచి స్మృతులు ఉన్నాయి. నాకంటే చిన్న వాడు... అన్నయ్య అని ప్రేమగా ఉండేవాడు. నేను కూడా సొంత తమ్ముడిలాగే చూసుకునే వాడిని. కోతలరాయుడు సినిమాకు ముందు రూపాయి కూడా ఇవ్వలేదు. సినిమా విడుదలైన తర్వాత ఆయన అడగలేదు. ఆయనకు డబ్బులు అందలేదని తెలిసి నేనే స్వయంగా తీసుకెళ్లి ఇచ్చాను. అది చాలా చిన్న అమౌంట్. బయటకు చెప్పేంత గొప్ప అమౌంట్ అయితే కాదు అని తమ్మారెడ్డి అన్నారు.

    ఇపుడు నేను కుచేలుడిని అయ్యాను

    ఇపుడు నేను కుచేలుడిని అయ్యాను

    మా మధ్య గ్యాప్ రావడం అనేది ఏమీ లేదు. మనుషులు ఎదుగుతా ఉంటాం. కృష్ణుడు, కుచేలుడు ఫ్రెండ్స్ ఎలాగో... మా ఇద్దరికీ పరిచయం అయినపుడు నేను కృష్ణుడు, ఆయన కుచేలుడు. ఇపుడు ఆయన కృష్ణుడయ్యాడు, నేను కుచేలుడిని అయ్యాను.... అని తమ్మారెడ్డి అన్నారు.

    నేనే చాలా సార్లు తిట్టాను

    నేనే చాలా సార్లు తిట్టాను

    మేము ఇద్దరం కలిస్తే బావుంటుందేమో తెలీదు. కలవాల్సిన అవసరం ఇద్దరికీ రాలేదు. కలిస్తే మామూలుగానే మాట్లాడు కుంటాం. నేనే అప్పుడప్పుడు ఆయన్ను తిడతా ఉంటాను కానీ ఆయన నా గురించి బ్యాడ్ గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనం నిజాలు కొన్ని ఒప్పుకోవాలి. నేను అతడి మీద ఇచ్చినన్ని స్టేట్మెంట్లు ఎవరూ ఇచ్చి ఉండరు. కానీ ఈ రోజు వరకు కూడా నా గురించి ఆయన ఒక్క మాట కూడా అనలేదు. కలిసినపుడు కూడా ఎందుకు ఇట్లా అన్నావ్ భరద్వాజ అని కూడా నన్ను అడగలేదు. ఆ గౌరవం నాకు అట్టి పెట్టాడు అని తమ్మారెడ్డి తెలిపారు.

    అన్నయ్యలా ఫీలయ్యాను కాబట్టే, ద్వేషం లేదు

    అన్నయ్యలా ఫీలయ్యాను కాబట్టే, ద్వేషం లేదు

    నేను ఎప్పుడు ఏదన్నా కానీ నేను అతడి కంటే పెద్దవాన్ని, అన్నయ్యలా ఫీలయ్యాను కాబట్టి అతడికి అది ఒక అడ్వైజ్ అనే ఉద్దేశ్యంతో అన్నానే తప్ప ఏ విధమైన ద్వేషం, ఈర్ష్యపెట్టుకుని అన్నది కాదు. అర్థం చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి మౌనంగా ఉన్నాడని నమ్ముతున్నాను అని తమ్మారెడ్డి అన్నారు.

    ఒక్క మాట అంటే చాలు ఆయన ఫ్యాన్స్ అంతా తిరగబడతారు

    ఒక్క మాట అంటే చాలు ఆయన ఫ్యాన్స్ అంతా తిరగబడతారు

    మా ఇద్దరి మధ్య ఆ రోజు ఉన్న ప్రేమ ఈ రోజు వరకూ ఉందని నమ్ముతున్నాను. నాకైతే ఉంది,, ఆయనకు కూడా ఉందనే నమ్ముతున్నాను. ఒక వేళ లేక పోయి ఉంటే ఏదో ఒకరోజు నా గురించి బ్యాడ్ గా మాట్లాడేవాడు. వీడెవడు నా గురించి మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అంటే చాలు ఆయన ఫ్యాన్స్ అంతా తిరగబడతారు. కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఆయన పెద్దరికం ఆయన నిలబెట్టుకున్నారు. నా పెద్దరికం నేను నిలబెట్టుకుంటున్నాను.... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    English summary
    Popular producer Tammareddy Bharadwaja made a film titled Kothala Rayudu with megastar Chiranjeevi. Tammareddy initially didn’t give any pay for Chiru for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X