భూమికి జానెడు లేదు.. కానీ కంగనకు అంత అది.. అందుకే సెట్లో క్రిష్‌ను తిట్టాను.. తమ్మారెడ్డి

ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మణికర్ణిక రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్, తమ్మారెడ్డి, ఆర్ నారాయణమూర్తి, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. అదేమిటంటే..

బాహుబలి అంటే ఇండియానే

బాహుబలి అంటే ఇండియానే

ఒకప్పుడు భారతదేశం అంటే గాంధీ, నెహ్రూ గుర్తొచ్చేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్.. ఇప్పుడు దేశం పేరు చెబితే బాహుబలి అంటున్నారు. అంతటి ఖ్యాతికి కారణం విజయేంద్ర ప్రసాద్. ఆయన రచించిన కథ దేశ సినిమా పరిశ్రమకు అంతటి కీర్తిని తెచ్చింది. 2 వేల కోట్లు కలెక్షన్లు అంటే అసాధారణమైన విషయం.

కంగన భూమికి జానెడు

కంగన భూమికి జానెడు

ఇప్పుడు మణికర్ణిక సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కథ ఇచ్చాడు. ఈ సినిమాలో టైటిల్ పాత్రను కంగన రనౌత్ పోషించింది. ఆమెను చూస్తే భూమికి జానెడు మాత్రమే ఉంటుంది. కానీ ఆమె నటన ఆకాశమంత ఎత్తు ఉంటుంది. చూడటానికి పొట్టిగా ఉన్న పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీస్తుంది.

కంగన రనౌత్ ఇరుగదీసింది

కంగన రనౌత్ ఇరుగదీసింది

కంగన నటించిన క్వీన్ చూశాను. చూడటానికి చిన్నగా కనిపించినా నటనతో ఇరుగదీసింది. ఆ తర్వాత తను వెడ్స్ మను సిరీస్‌లో చూశాను. మళ్లీ మణికర్ణిక ట్రైలర్ చూస్తే మతిపోయింది. పెర్ఫార్మెన్స్‌లో ఆమెకు ఎవరూ సాటిరారనిపించే స్థాయిలో నటించినట్టు కనిపిస్తున్నది.

అప్పుడే కమిట్‌మెంట్ అర్ధమైంది

అప్పుడే కమిట్‌మెంట్ అర్ధమైంది

మణికర్ణిక సినిమా షూటింగ్‌కు నేను వెళ్లాను. ఆ సమయంలో ఉదయం షూటింగ్ పూర్తి చేసుకొని మళ్లీ సాయంత్రం 7 గంటల సమయంలో వచ్చింది. ఆమె రావాల్సిన టైమ్‌కు లేటుగా వస్తే.. బాలీవుడ్ హీరోయిన్లు అంతే అనుకొన్నాను. ఇలాంటి వాళ్లను పెట్టుకొని సినిమా ఏం తీస్తారో అని క్రిష్‌ను తిట్టాను. కానీ 25 నిమిషాల్లో మేకప్‌తో సెట్స్ మీదకు రావడం చూసి ఆమె కమిట్‌మెంట్ ఏమిటో అర్దమైంది.

క్రిష్ జాగర్లమూడి హ్యాట్సాఫ్

క్రిష్ జాగర్లమూడి హ్యాట్సాఫ్

మణికర్ణిక సినిమా తీసిన క్రిష్ జాగర్లమూడి పట్టుదల గొప్పది. ఒకే సంవత్సరం మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న, 25న మణికర్ణిక, ఫిబ్రవరి 7న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సినిమా చరిత్రలో ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు చేయడం రికార్డు అవుతుందేమో అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X