twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పార్టీ పెడితే...చేరేది దొంగలు, పనికిరానివాళ్లే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆయన పార్టీ పెడుతున్నారనే వార్త ప్రచారంలోకి రాగానే వివిధ వర్గాల నుండి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ....సంచలన వ్యాక్యలు చేసారు.

    పవన్ పార్టీ ఆరు నెలల ముందు పెడితే బాగుండేదని, మంచి అభ్యర్థులను వెతికే అవకాశం ఉండేదని, ఇపుడు పార్టీ పెడితే వచ్చి చేరేది ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారు, లంచగొండులు, దొంగలు మాత్రమే అని, ఎంతో క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టక పోవడమే మంచిందని, ఆయన ఇపుడు పార్టీ పెడితే గతంలో చిరంజీవి చేసిన తప్పే చేసినట్లవుతుందని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయ పడ్డారు.

    Tammareddy Bharadwaja about Pawan Kalyan party

    ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ....'ఇపుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి పార్టీ అవసరమే కానీ, చాలా ఆలస్యం అయింది. ఎలక్షన్స్ కూడా డిక్లేర్ అయిపోయింది. క్యాండెట్లు దొరకాలంటే కష్టం. పవన్ కళ్యాణ్ లాంటి వారు ఓ ఆరు నెలల ముందు వచ్చి ఉంటే మంచి క్యాండేట్లను వెత్తుకునే అవకాశం ఉండేది. ఇపుడు పవన్ పార్టీ పెడితే....వేరే పార్టీలో సీట్లు రాని వారు, ఫ్రాడ్ చేసి వచ్చినోళ్లు, జంపింగ్ జాగ్స్...లేక పీఆర్పీలో మిగిలి పోయిన వాళ్లు, ఇటువంటి వాళ్లంతా చేరతారు అన్నారు.

    అదే జరిగితే మళ్లీ పనికి రానివాళ్లు, లంచగొండులు, దొంగలంతా చేరితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా పోతుంది. ఆయన రాకుండా ఉంటేనే మంచిందని నా ఉద్దేశ్యం. ఇప్పుడు ఆయనకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. దాన్ని పోగొట్టుకోవద్దు. పవన్ ఇపుడు పార్టీ పెడితే చిరంజీవి గతంలో చేసిన తప్పే ఇపుడు చేసినట్లు అవుతుంది. చెయ్యాలనుకుంటే ముందు చేసి ఉంటే బాగుండేది అన్నారు.

    English summary
    Some well wishers of Power Star Pawan Kalyan are advising him not to enter politics, while others are advising him otherwise. Director and producer Tammareddy Bharadwaja said 'PAWAN KALYAN SHOULD NOT ENTER POLITICS'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X