‘దాసరి’ని బూతులు తిట్టేవారు, ఆ నీచులు ఈ రోజు రాలేదు.. మంచిదే: తమ్మారెడ్డి
తెలుగు సినిమా పరిశ్రమలో 'గురువు గారు' అంటే అందరికీ గుర్తొచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావు. దర్శకుడిగా గొప్పపేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చారు. 50 ఏళ్ల పాటు పరిశ్రమకు విశిష్ట సేవలందించిన దాసరి ఎంతో మందికి స్పూర్తి. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించడంలో ముందుండేవారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. దాసరి జ్ఞాపకంగా మే 4ను 'డైరెక్టర్స్ డే'గా ప్రకటిస్తూ తెలుగు చిత్రసీమ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఇండస్ట్రీలో ఆ నీచుల గురించి అప్పుడే గురువుగానికి చెప్పాను
‘గురువుగారు ఉన్న సమయంలో కొందరు పోటీలుపడి వచ్చేవారు. ఆయనతో ఎప్పుడూ ఉండే మా లాంటి వారిని తోసుకుని వెళ్లేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు. 20 ఏళ్ల క్రితం రోడ్ నెం.10లో గురువుగారితో ఓ విషయం చెప్పాను. ఇది చాలా నీచమైన ఇండస్ట్రీ సార్, చాలా మంది నీచులు ఉన్నారు. వీళ్లతో మనకు ఎందుకు సార్ వదిలేయండి అని చెప్పాను... అని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

ముందు కాళ్లు పట్టుకుని, వెనక బూతులు తిట్టేవారు
నా నీచులు గురువుగారి దగ్గకు వచ్చేవారు, కాళ్లకు దండం పెట్టేవారు, ఆయనతో పనులు చేయించుకుని, తమ పనులు పూర్తయిన వెంటనే బూతులు తిట్టేవారు. ఇదే విషయం గురువుగారికి చెబితే ఆయన ఒకటే చెప్పారు. ‘ఎవరెవరె ఏలాంటి నాటకాలు ఆడుతున్నారో అన్నీ నాకు తెలుసు. ఈ రోజు ఇండస్ట్రీలో మనలాంటి ప్రశ్నించే వాడు ఉన్నాడు కాబట్టే వారందరూ భయ పడతారు. లేక పోతే ఇండస్ట్రీ కకలావికలం అయిపోతుంది' అని దాసరి చెప్పినట్లు తమ్మారెడ్డి గుర్తు చేశారు.

ఆయన చెప్పినట్లే ఇపుడు కకావికలం అయింది
గురువుగారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉండేవారు. ఆయన పోయిన తర్వాత ఇండస్ట్రీ ఎలా అయిందో మనం అందరం చూస్తున్నాం. ఈ సంవత్సర కాలంగా ఇండస్ట్రీ కకావికలం అయింది. అపుడు గురువుగారు అలా చెప్పినపుడు... ఇలాగే చెబుతారులే అనుకునేవాడిని... కానీ, ఇపుడు అర్థం అవుతోందని తమ్మారెడ్డి తెలిపారు.

ఆ నీచులు వస్తారని అనుకోలేదు, రాక పోవడం మంచిదే
గురువుగారు ఉన్నన్ని రోజులు ఎంత మంది ఎన్ని తిట్టుకున్నారో నాకు తెలుసు. కానీ ఆయన దగ్గరకు వచ్చి పిల్లుల్లాగా ఉండి, కాళ్లకు దండం పెట్టి పక్కనే ఉండేవారు. వాళ్లు వస్తారని ఎప్పుడూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. వాళ్లు రావాలని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అటువంటి వాళ్లు రాకుండా ఉండటమే మంచిది. ఎవరికైతే మనస్ఫూర్తిగా మమకారం ఉందో, ప్రేమ ఉందో వారే వచ్చారు.... అని తమ్మారెడ్డి అన్నారు.

తమ్మారెడ్డి కామెంట్స్ ఎవరిపై?
నీచులు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఎవరి గురించి ఈ కామెంట్స్ చేశారు? అనేది హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీలో ప్రముఖుడిగా పేరొంది, దాసరి ఉన్నంత కాలం ఆయన వెనకలే గురువుగారు, గురువుగా అని తిరిగిన ఓ బిగ్ యాక్టర్ గురించే తమ్మారెడ్డి ఈ కామెంట్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











