twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కత్తి' పేరుతో కోట్లు.., కానీ చిల్లిగవ్వ కూడా!,ఆ కారణంతోనైనా ఇక మానేయాలి: ఏకిపారేసిన తమ్మారెడ్డి

    |

    ఇదేమైనా జాతీయ సమస్యా?.. ఓ ఫిలిం క్రిటిక్, ఓ హీరో అభిమానుల మధ్య వివాదం. అంతదానికే.. అదేదో సామాజిక సమస్య లాగా గంటల తరబడి టీవి చానెల్స్ అన్నీ 'కత్తి'పైనే ఫోకస్ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మహేష్ కత్తి-పవన్ ఫ్యాన్స్ వివాదాన్ని అనవసరంగా టీవి ప్రేక్షకుల పైన రుద్దుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాదంపై దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

    Recommended Video

    'కత్తి' లో తెలియని కోణాలు.. ఫ్యాన్స్‌తో వివాదంపై తమ్మారెడ్డి !
     దేశంలో చాలా సమస్యలున్నాయి:

    దేశంలో చాలా సమస్యలున్నాయి:

    ఇటీవల 'నిర్భయ' ఘటనని మించిన సంఘటన ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది. అలాగే సుప్రీం న్యాయమూర్తుల నిరసన కార్యక్రమం దేశాన్నే కుదిపేసేలా తయారైంది. ఇక ఈ మధ్యే పీఎం మోడీని సీఎం చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో ఏం జరిగిందో చూచాయగా అర్థమైతే, రాష్ట్ర భవిష్యత్తుకి ఏం ఒరుగుతుందో కూడా కాస్త విశ్లేషించవచ్చు.

     గంటల తరబడి ఏంటిదంతా?:

    గంటల తరబడి ఏంటిదంతా?:

    దేశంలో ఇంత జరుగుతున్నా.. ఇన్ని చర్చించాల్సిన విషయాలున్నా.. టీవి చానెల్స్ మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు. వాటిపై మరింత సమాచారం కోసమో.. విశ్లేషణ కోసమో టీవి పెడితే.. 'మెరుగైన సమాజం కోసం' పనిచేసే చానెల్ గానీ,

    'దమ్మున్న చానెల్' గానీ ఏ ఒక్క వార్తకు ప్రాధాన్యత ఇవ్వకుండా గంటల తరబడి కత్తి మహేష్‌తో చర్చలను చూపిస్తున్నారు.

     సమాజానికి మంచిది కాదు:

    సమాజానికి మంచిది కాదు:

    ఓపక్క చర్చించాల్సిన కీలక విషయాలు చాలా ఉంటే.. మరో పక్క సమాజానికి ఏవిధంగానూ పనికిరాని ఓ సమస్య మీద గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నారు. కొద్ది నెలలుగా ఇదే తంతు జరుగుతోంది. సమాజానికి ఇది మంచిది కాదు.

     కత్తి మహేష్ పుణ్యమాని టీఆర్పీలు..:

    కత్తి మహేష్ పుణ్యమాని టీఆర్పీలు..:

    దేశంలో కత్తి మహేష్ తప్ప వేరే ఏ సమస్యలు లేవని ప్రజల్ని మీరు మభ్యపెట్టదలుచుకున్నారా?.., నెలకు రూ.2కోట్ల నుంచి మూడు కోట్ల వరకు సిబ్బందికి చెల్లించే టీవి చానెల్స్.. కత్తి మహేష్ పేరిట టీఆర్పీలు తెచ్చుకోవడం దురదృష్టకరం.

     'కత్తి'కి చిల్లిగవ్వ ఇవ్వడం లేదు..:

    'కత్తి'కి చిల్లిగవ్వ ఇవ్వడం లేదు..:

    ఇన్ని చానెళ్లు నాలుగు నెలలుగా ఈ తంతును కొనసాగిస్తూ కత్తి పేరుతో కోట్ల రూపాయాలను సొమ్ముచేసుకుంటున్నాయి. అయితే అందులో నుంచి చిల్లిగవ్వ కూడా కూడా మహేష్ కత్తికి ఇవ్వడం లేదు. కనీసం ఆ కారణంతోనైనా మహేష్ కత్తి ఇక ఉదయం 6గం.నుంచి రాత్రి 11గం. దాకా స్టూడియోల చుట్టు తిరగడం మానేయాలి.

     ఆ చానెల్స్ పైనే విమర్శలు..:

    ఆ చానెల్స్ పైనే విమర్శలు..:

    తమ్మారెడ్డి భరద్వాజ పరోక్షంగా టీవి9కి, ఏబీఎన్ చానెల్ కు క్లాస్ పీకినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అలాగే నిన్న మొన్నటి దాకా అంతగా ఆదరణకు నోచుకోని మరో చానెల్ కూడా కత్తిని ఉపయోగించుకునే టీఆర్పీ పెంచుకుందన్న తరహాలో ఆయన కామెంట్స్ ఉన్నాయి.

     ఫుల్ స్టాప్ లేదా?

    ఫుల్ స్టాప్ లేదా?

    కత్తి పుణ్యమాని న్యూస్ చానెల్స్ టీఆర్పీలు పెంచుకుంటున్నాయన్నది నిర్వివాదాంశం. అటు యూట్యూబ్ లోనూ పలు చానెల్స్ కత్తి వార్తలతో వ్యూస్ సంపాదించుకునే పనిలో పడ్డాయి.

    ఏదేమైనా ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలనే అంతా కోరుకుంటున్నారు. కత్తి మాత్రం ఇంతదాకా వచ్చాక తాను మధ్యలో డ్రాప్ అయ్యే పరిస్థితే లేదంటున్నాడు. ఇక ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Film Maker Tammareddy Bharadwaja criticized telugu news channels for highlighting issue between Mahesh Kathi and Tammareddy Bharadwaja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X