twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తెలుగు నిర్మాతల మండలి' లో 10 కోట్ల స్పాహా కుట్ర

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొంతమంది పెద్ద నిర్మాతలు కలిసి 'చిత్రసీమ' అనే ఛానెల్‌ పెట్టబోతున్నారు. దీనికీ చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతల మండలిలో 16 కోట్ల రూపాయలున్నాయి. అందులోంచి 10 కోట్ల రూపాయలు ఎలాగైనా ఈ ఛానెల్‌లోకి పంపడానికి కుట్రలు చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేసారు యలమంచిరి రవిచంద్. ఆయన నిర్మాతల మండలి కార్యవర్గ సభ్యుడుగా రాజీనామా చేసారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

    ఆయన మాట్లాడుతూ.. ''మా జట్టు నుంచి పదకొండు మంది ఎంపికయ్యాం. కానీ ఏం చేయలేకపోతున్నాం. కొంతమంది పెద్ద నిర్మాతలు కలిసి 'చిత్రసీమ' అనే ఛానెల్‌ పెట్టబోతున్నారు. దీనికీ చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతల మండలిలో 16 కోట్ల రూపాయలున్నాయి. అందులోంచి 10 కోట్ల రూపాయలు ఎలాగైనా ఈ ఛానెల్‌లోకి పంపడానికి కుట్రలు చేస్తున్నారు. దానికి టి.ప్రసన్నకుమార్‌ అడ్డుపడుతున్నాడు. ఎలాగైనా ఆయన్ని తప్పించాలని లేనిపోని దానికి రాద్ధాంతం చేసి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. నిర్మాతల మండలికంటూ నియమాలు ఉన్నా వాటిని తుంగలో తొక్కేశారు అన్నారు.

    అలాగే ''నిర్మాతల మండలిలో జరిగే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది నిర్మాతలు చేసే అన్యాయాలు చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే కార్యవర్గ సభ్యుడిగా కొనసాగకూడదని నిర్ణయించుకొన్నాను. రాజీనామా చేశాను. ఉదాహరణకు సి.కల్యాణ్‌ 'రౌడీప్రియుడు' అనే సినిమాకు సంబంధించి కౌన్సిల్‌కు లక్షా డబ్బైవేలు బాకీపడ్డారు. ఆయన పిల్లలిద్దరూ మైనర్‌లే. కానీ వాళ్లకు కౌన్సిల్‌ సభ్యత్వం ఉంది. ఓట్లేస్తున్నారు. ఇదేం న్యాయం అని అడగడానికి లేదు. ఇంకొంతమంది సభ్యులు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు''' అన్నారు నిర్మాత యలమంచిలి రవిచంద్‌.

    ఇక నిర్మాతల మండలిలో చోటు చేసుకున్న వివాదం గురించి చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజని ప్రశ్నిస్తే ''అక్కడ అవకతవకలు జరిగే అవకాశం లేదు. అయితే దాన్ని ఎవరు ఎలా కావాలంటే అలా అన్వయించుకోవచ్చు'' అన్నారు. ఈ సందర్భంగా భరద్వాజ మాట్లాడుతూ ''చలన చిత్రమే జీవితం అనుకొని ఓ అభిరుచితో నిర్మాణం చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. సినిమా అనేది ప్రత్యామ్నాయ వ్యాపారమైంది. సామాజిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని చిత్రాలు రూపొందించాలి. సినిమా, ప్రేక్షకుడు, పరిశ్రమ... తదితర విషయాలపై పూర్తి అవగాహనతో చిత్ర నిర్మాణానికి పూనుకొన్నప్పుడే ఆ నిర్మాత విజయవంతం అవుతాడు. చిత్రసీమలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను'' అన్నారు.

    ''మన చిత్రాలకు తెలుగు భాషలోనే పేర్లు పెట్టేలా చూస్తాం. ఈ మేరకు అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో చర్చ కూడా చేశాం. ఈ మేరకు చట్టం తెచ్చేలా చూస్తాము''అన్నారు ఢిల్లీ, ఒరిస్సాల్లో అత్యాచార సంఘటనల ఆధారంగా 'ప్రతిఘటన' అనే చిత్రం రూపొందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందన్నారు.

    English summary
    Producer Yalamanchili Ravi Chand resign film chamber membership and talk about AP Film Chamber of Commerce issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X