నరేష్, శివాజీరాజా కలిసే.. వాళ్లను కొట్టుకోమంటారా? మా అవకతవకల గురించి.. మీడియాపై తమ్మారెడ్డి ఫైర్

Recommended Video

Maa Press Meet : Tammareddy Bharadwaja Shouts On Media

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా)లో జరిగిన అవకతవకలపై సంస్థ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ వ్యవహారంలో దాదాపు 2 నుంచి 4 కోట్ల రూపాయలు మేరకు అవకతవకలు జరిగాయని మీడియాలో ప్రచారం అయ్యాయి. ఆ వివాదంపై వివరణ ఇవ్వడానికి శనివారం (మా) ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, నరేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని చెప్పడంతో గందరగోళంగా మారింది.

ఎలాంటి అవకతవకలు లేవు

ఎలాంటి అవకతవకలు లేవు

మా, మీడియా ఒకరికొకరు కలిసి ఉన్నాం. కొన్నిసార్లు మీరు అభ్యంతరాలు తెలిపారు. మేము కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మాలో ఎలాంటి అవకతవకలు జరుగలేదు. మాకు రావాల్సిన డబ్బులు సరిగానే వచ్చాం. అవసరం లేని కొన్ని విషయాలు మనకు సంబంధం లేదు. మీడియాలో ఈ వ్యవహారంపై ఎక్కువ చర్చ జరిగినందున వివరణ ఇచ్చేందుకు వచ్చాం.

కలెక్టివ్ కమిటీ స్పందిస్తుంది

కలెక్టివ్ కమిటీ స్పందిస్తుంది

సినిమా పరిశ్రమలో భవిష్యత్‌లో ఎదైనా సమస్య వస్తే దానిపై కలెక్టివ్ కమిటీ స్పందిస్తుంది. అందుకోసం కలెక్టివ్ కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని చెప్పడానికే మీడియాను పిలిచాం అని భరద్వాజ చెప్పారు. దాంతో మీడియా కొన్ని సమాధానాలు రాబట్టడానికి పట్టుబట్టడటంతో గందరగోళం నెలకొన్నది.

 ఏదైనా చేసుకోవాలంటే చేసుకొండి

ఏదైనా చేసుకోవాలంటే చేసుకొండి

మా అవకతవకలపై జరిగింది చెప్పాం. గతంలో జరిగిన విషయాలను తవ్వుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం. మీరు ఏదైనా చేయాలనుకొంటే చేసుకొండి. ఇండస్ట్రీ తరఫున మాట్లాడానికి వచ్చాను. ఇది వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు అని చెప్పారు.

వాళ్లను కొట్టుకోమంటారా?

వాళ్లను కొట్టుకోమంటారా?

శివాజీ రాజా, నరేష్ ఒకరికొకరు ఆరోపణలు చేసుకొన్న తర్వాత ఎలా కలిసి పనిచేస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎలాంటి ఆరోపణలు చేసుకొన్న అవి గతమే. ఇప్పుడు వాళ్లను కొట్టుకోమని అంటారా అని తమ్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.

పట్టుబడ్టిన మీడియా

పట్టుబడ్టిన మీడియా

నరేష్, శివాజీరాజా ఆరోపణల గురించి కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకొంటున్నాం. కాబట్టి వారితో మాట్లాడే అవకాశం ఇవ్వాలని మీడియా కోరింది. అయితే అందుకు భరద్వాజా నిరాకరించారు. దాంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తీరు మీడియాను పిలిచి అవమానించే విధంగానే ఉంది అని అన్నారు. దానికి తమ్మారెడ్డి సమ్మతించకపోతే మీడియా ఎలా కనిపిస్తుంది అని మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీకు డౌట్లు అవసరం లేదు

మీకు డౌట్లు అవసరం లేదు

మీడియా ఇలా ప్రశ్నలు అడిగితే మేము వెళ్లిపోతాం అని తమ్మారెడ్డి అనగా.. మీరు మాట్లాడి మీరు వెళ్లిపోతామంటే ఎలా? నరేష్, శివాజీరాజాతో మేము మాట్లాడుతాం అని మీడియా ప్రతినిధులు కోరారు. దాంతో మీకు డౌట్లు ఉండనవసరం లేదు. 40 ఏళ్లుగా సమస్యలను మీకు చెప్పాను. మీ సమస్యలు మాకు చెప్పారు. వివాదానికి ముగింపు పలకాలి అని భరద్వాజా అన్నారు.

మీకు సమాధానాలు ఇవ్వం

మీకు సమాధానాలు ఇవ్వం

‘మా'లో జరిగిన విషయాలను శివాజీ రాజా, నరేష్ వాళ్లే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. వాటిపై మాకు కొన్ని సందేహాలున్నాయని మీడియా ప్రతినిధులు పట్టుపట్టగా తమ్మారెడ్డి సమాధానాలు ఇవ్వం అని అన్నారు. దాంతో సమావేశం గందరగోళంగా మారింది. ఆ గందరగోళం నివారించడానికి నిర్మాత సురేష్ మైక్‌ను అందుకొని సర్దిచెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X