కృష్ణగారి సినిమా 'అత్తారింటికి దారేది'లా తీసి ఉంటే.. మన ఫ్రెండ్‌షిప్ కట్ అన్నారు.. తమ్మారెడ్డి!

సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి సినీ అభిమానులందరికి తెలిసే ఉంటుంది. వర్ధమాన విని రాజకీయ వ్యవహారాలపై ఆయన తన అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడిస్తారు. సినీ ఇండస్ట్రీలో ఈ సమస్య వచ్చినా ఆయన చొరవ తీసుకుని స్పందిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. తాజగా ఆయన ఓ టివి ప్రోగ్రాంలో హాస్య నటుడు అలీతో ముచ్చటిస్తూ తన సినీ వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు వెల్లడించారు. కొందరి సినీ ప్రముఖులతో తనకు జరిగిన గొడవల గురించి ఈ ఇంటర్వ్యూ లో తమ్మారెడ్డి ప్రస్తావించారు.

Recommended Video

Tammareddy Bharadwaj Makes Sensational Comments On Hero Krishna
ఉస్మానియా గొడవలు

ఉస్మానియా గొడవలు

తమ్మారెడ్డి తెరకెక్కించిన అలజడి చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రాన్ని శివ చిత్రంలో అప్పట్లో పోల్చారు. శివ చిత్రం విజయవాడ లైలా కాలేజీ గొడవలు సంబంధించినదని అని, అలజడి చిత్రం ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ గొడవలకు సంబంధించినది అని తమ్మారెడ్డి అన్నారు.

ఆ సినిమా గురించి మాట్లాడకపోవడమే మంచిది

ఆ సినిమా గురించి మాట్లాడకపోవడమే మంచిది

హిందీలో ఘనవిజయం సాధించిన షారుఖాన్ చిత్రం రైట్స్ కొనుక్కుని తెలుగులో రాజశేఖర్ తో వేటగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించానని అన్నారు. ఆ చిత్రం తనకు చేదు జ్ఞాపకమని తమ్మారెడ్డి అన్నారు. దాని గురించి మాట్లాడక పోవడమే మంచిదని అభిప్రాయ పడ్డారు.

పెద్ద హీరోయిన్‌తో ఎఫైర్

పెద్ద హీరోయిన్‌తో ఎఫైర్

అప్పట్లో ఓ పెద్ద హీరోయిన్ తో తమ్మరెడ్డికి ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలని అలీ ప్రస్తావించారు. ఆ వార్తలు 100 శాతం అబద్దం అని తమ్మారెడ్డి అన్నారు. ఒకవేళ నిజమై ఉంటె ఈ వయసులో ఒప్పుకోవడానికి తనకు అభ్యంతరం లేదని, కానీ ఆవార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు.

కృష్ణ గారితో పెద్ద గొడవ

కృష్ణ గారితో పెద్ద గొడవ

కృష్ణ గారు నటించిన రౌడీ అన్నయ్య చిత్రాన్ని తమ్మారెడ్డి తెరకెక్కించారు. ఆ చిత్రంలో సిల్క్ స్మితతో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ విషయంలో కృష్ణగారికి, నాకు నమస్పర్థలు వచ్చాయని అన్నారు. కథ పరంగా ఆ సాంగ్ లో కృష్ణ ఉండకూడదని అనుకున్నా. ఆయనకు తాను కూడా సాంగ్ చేయాల్సిందే అని పట్టు బట్టారు.

మోసం చేశాం

మోసం చేశాం

సిల్క్ స్మిత సాంగ్ లో హీరో లేకుంటే ఎలా అని కృష్ణ వాదిస్తుండడంతో సాంగ్షూట్ చేసాం. కృష్ణ గారు లేకుండా కూడా షూట్ చేశాం. చివరి కాపీని అలాగే సిద్ధం చేశాం. సెన్సార్ సమయంలో సిల్క్ స్మితతో తన డాన్స్ లేదని కృష్ణ తెలుసుకున్నారు.

 ఫ్రెండ్‌షిప్ కట్

ఫ్రెండ్‌షిప్ కట్

ఆ విషయం తెలుసుకున్న అనంతరం కృష్ణ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మన ఫ్రెండ్ షిప్ కట్ అని వెళ్లిపోయారు. నాపై ఆయనకు చాలా కోపం వచ్చింది అని తమ్మారెడ్డి అన్నారు.

అత్తారింటికి దారేది చూశాకే

అత్తారింటికి దారేది చూశాకే

అత్తారింటికి దారేది చిత్రం చూశాకే తాను కృష్ణగారి విషయంలో చేసిన తప్పు తీసుకున్నానని అన్నారు. క్లైమాక్స్ లో హీరో అల్లరి చిల్లరగా డాన్సులు వేస్తే కథ పాడవుతుందని భావించి కృష్ణగారిని సిల్క్ స్మిత సాంగ్ కు అంగీకరించలేదని తమ్మారెడ్డి అన్నారు.

పవన్ కళ్యాణ్ క్లైమాక్స్‌లో

పవన్ కళ్యాణ్ క్లైమాక్స్‌లో

అత్తారింటికి దారేది చిత్ర క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో డాన్సులు వేసే సన్నివేశాలు ఉంటాయి. అయినా కూడా ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. అప్పుడే రౌడీ అన్నయ్య విషయంలో తన తప్పు తెలిసిందని అన్నారు. అప్పట్లో రౌడీ అన్నయ్య చిత్రం యావరేజ్ ఆ ఆడింది. సిల్క్ స్మిత, కృష్ణ సాంగ్ పెట్టివుంటే పెద్ద విజయం సాధించేది అన్నారు.

అలాంటి ఘోరం జరగకూడదు

అలాంటి ఘోరం జరగకూడదు

అమెరికాలో తన మనవడి మరణాన్ని గుర్తు చేసుకున్న తమ్మారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ సంఘటన ఎలా జరిగిందో కూడా తెలియదని ఇలాంటి ఘోరం ఏ కుటుంబానికి జరగకూడదని బాధపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X