ప్రముఖ హీరోగా నటిస్తున్న పలాస 1978: వాస్తవ సంఘటనల ఆధారంగా
అభ్యుదయ భావాలతో, ప్రేక్షకుడిని ఆలోచింప జేసే చిత్రాలు నిర్మించే తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ యదార్థ గాథ తెరమీదకు రానున్నది. పలాస 1978 అనే చిత్రాన్ని కరుణ కుమార్ దర్శకత్వంలొ అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ని సమకూరుస్తున్నారు.
యదార్ద సంఘటనల ఆధారంగా "పలాస 1978" చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నాం. పలు చిత్రాలకు రచన దర్శకత్వ విభాగంలో పని చేసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రంలో ప్రముఖ హీరోతోపాటు వర్దమాన కథానాయకుడు ఈ చిత్రంలొ నటించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతలు అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ పేర్కొన్నారు.
జనవరిలొ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











