twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలొద్దు, మోహన్‌బాబుకు తమ్మారెడ్డి ఝలక్

    By Bojja Kumar
    |

    Tammareddy Bharadwaja
    హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు, ప్రజలు కన్నీరు పెడుతుంటే మనం పన్నీరు చల్లుకోవడం ఏమిటి? అని ప్రశ్నిస్తూ వందేళ్ల సినిమా పండగను వాయిదా వేయాలని నటుడు మోహన్ బాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు లేఖపై ఫిల్మ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు.

    సినిమాలకు, రాజకీయాలకు ముడి పెట్ట వద్దని, 4 రాష్ట్రాలు కలిసి ఈ వేడుకను నిర్వహిస్తున్నాయని, అంతా సవ్యంగానే జరుగుతుందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు చెన్నైలో భారతీయ సినిమా నూరేళ్ల వేడుక జరుగుతుందని, అందులో 22న తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను సన్మానించనున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.

    కాగా...మెహన్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్ర ఆందోళనలతో ఉన్న ఈ సమయంలో సినిమా పండుగ వద్దని, వాయిదా వేయాలని లేఖ రాసిన మాట వాస్తవమే అని, అయితే అది తన వ్యక్తి గత అభిప్రాయమే, వారు నా మాట వినాలని కాదు, నా మనసులో ఉన్న ఆవేదనను లేఖ ద్వారా బయట పెట్టాను, అంతకు మించి ఏమీ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.

    English summary
    
 Tamma Reddy Bharadwaja Reacts On Mohan Babu's letter. Mohan Babu to write letter to AP Film Chamber. He has questioned the move for celebrating the centenary of Telugu Cinema at a time when the entire Telugu state is in turmoil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X