శ్రీదేవిని చూపిస్తే 2 లక్షలు ఆఫర్.. ఆమె క్రేజ్ తో నిర్మాతకు షాక్!
అతిలోక సుందరి శ్రీదేవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీదేవి అందం, అభినయంతో యావత్ భారతాన్ని సమ్మోహన పరిచింది. 70, 80 దశకాల్లో శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ తో టాప్ స్టార్ గా కొనసాగింది. అలంటి అందాల దేవకన్య దివికి ఏంగింది. శ్రీదేవి అకాల మరణంతో దిగ్భ్రాంతి చేసిన సినీలోకం ఆమెతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖ దర్సక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాను సినీరంగంలోకి ప్రవేశించిన కొత్తలో శ్రీదేవి విషయంలో ఎదురైన ఘటననని గుర్తు చేసుకున్నారు.
Recommended Video


దేవకన్యని అభిమానించని వారు ఎవ్వరు
చిరంజీవి మాటల్లో చెప్పాలంటే.. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో దేవకన్య పాత్ర శ్రీదేవి కోసమే సృటించబడిందా లేకా ఆ పాత్రకోసమే శ్రీదేవి పుట్టిందా అన్నట్లుగా ఆమె నటించింది. శ్రీదేవి అందం అభినయం గురించి ఈ మాటలు చాలు.

80ల్లో పడి చచ్చేవారు
శ్రీదేవి క్రేజ్ 80 దశకంలో దేశం మొత్తం వ్యాపించింది. యువకుల హృదయాల్లో కొలువున్న దేవత శ్రీదేవి.

శ్రీదేవిని చూపిస్తే 2 లక్షలు
తమ్మారెడ్డి భరద్వాజ తాను సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. తన స్నేహితుడొకడు దుబాయ్ నుంచి ఫోన్ చేసిన తనకు శ్రీదేవిని చూపించాలని కోరాడని, అందుకు రూ 2 లక్షలు ఆఫర్ చేయడం విశేషం అని ఆయన అన్నారు.

పరిచయం అవసరం లేదు
తనకు శ్రీదేవిని పరిచయం చేయాల్సిన అవసరం లేదని, కేవలం చూపిస్తే 2 లక్షల ఇస్తానని తన స్నేహితుడు చెప్పడంతో షాక్ కి గురయ్యానని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దానితో శ్రీదేవికి ఉన్న క్రేజ్ తనని ఆశ్చర్యపరిచిందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

క్రేజ్ తగ్గలేదు
వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి సెకండ్స్ ఇన్నింగ్స్ లో చేసిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో తన క్రేజ్ తగ్గలేదని నిరూపించారని తమ్మారెడ్డి అన్నారు.


Click it and Unblock the Notifications











