చాలామంది అకౌంట్స్ తెలుసు.. అవార్డ్ కోసం కాళ్లు పట్టుకున్నారు.. నాగబాబుకు తమ్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం RRR. ఈ సినిమా ప్రపంచస్థాయిలో సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్ వంటి తదితర అవార్డ్స్ తోపాటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే ఈ సినిమాపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల చేసిన కామెంట్స్ వివాదం అయ్యాయి.
ఆ కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ పై నటుడు, నిర్మాత నాగబాబు ఘాటు విమర్శలు చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ట్వీట్ చేశారు. తాజాగా వీరిద్దరికి కౌంటర్ ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇలా వీరిద్దరి కౌంటర్ ఎన్ కౌంటర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఖర్చు పెట్టారా..
ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో తమ్మారెడ్డి భరద్వాజ, నాగబాబు పరస్పర విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. RRR సినిమా ఆస్కార్ అవార్డుల ప్రచారం కోసం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారు. అదే డబ్బుతో 8 నుంచి 10 సినిమాలు చేయొచ్చు. వారు ఊరికే ఫ్లైట్ టికెట్లకే రూ. 80 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన మాటలకు నాగబాబు నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా, రాజమౌళిని చూసి జెలసీ ఫీల్ అవుతున్నావా అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

నాకెందుకు జెలసీ..
అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నీకు అకౌంట్స్ తెలుసా అని తమ్మారెడ్డి భరద్వాజను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా వీరి వాఖ్యలపై రియాక్ట్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. "నీకు లెక్కలు తెలుసా అని, రాజమౌళిని చూసి నేను జెలసీగా ఫీల్ అవుతున్నానని అన్నారు. అసలు నేను ఆయన్ను చూసి జెలసీ ఫీల్ అవ్వడానికి నేను ఆయనకు పోటీగా ఉండాలి.. ఆయనతో సమానంగా సినిమాలు తీసేవాడినైనా అయుండాలి. నాకెందుకు జెలసీ. నేనేదో కృష్ణ రామా అని బతుకుతున్నాను. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు" అని తమ్మారెడ్డి అన్నారు.

కాళ్లు పట్టుకున్నారు...
తమ్మారెడ్డి భరద్వాజ కొనసాగిస్తూ "నన్ను ఎవరొ ఒకరు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది బయట వ్యక్తులంటే పెద్దగా పట్టించుకోను. కానీ ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారు నన్ను అన్నారు. నాకు అకౌంట్స్ తెలుసా అన్నారు. నాకేం తెలియనక్కర్లేదు. నాకు చాలా మంది అకౌంట్స్ తెలుసు. ఎవడెవడు ఎవడెవడ్నీ ఏ అవార్డుల కోసం ఏం అడుక్కున్నారు.. ఏ పదవుల కోసం ఏం అడుక్కున్నారో, ఎవడెవడి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. ఇవన్నీ మాట్లాడి ఇండస్ట్రీ పరువు రోడ్డు మీద వేయటం నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు ఆ పని చేయలేదు" అని తెలిపారు.

నాకు సంస్కారం నేర్పించాడు..
"ఇండస్ట్రీ నాకు తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తాను కాబట్టి నేను ఎప్పుడు ఏదీ మాట్లాడను. ఈరోజుకి నేను సంయమనంగానే మాట్లాడుతుంటే.. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒకడైతే నీయమ్మా మొగుడు అని అంటాడు. మా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు. మా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నీతిగా బతకటం నేర్పించాడు. నిజం చెప్పటం నేర్పించాడు. మీకు నేర్పించారా. మీకు తెలుసా. నిజమేంటో మీరు చెప్పగలరా. కులాలు, మతాలు గురించి మాట్లాడే మీరా నా గురించి మాట్లాడేవాళ్లు. మీకు హక్కు ఉందా అలా మాట్లాడటానికి. ఇప్పటికీ ఇంకేమైనా మాట్లాడాలంటే సంస్కారం అడ్డొస్తుంది" అని తమ్మారెడ్డి మాట్లాడారు.

మీకు సిగ్గు ఉండాలి..
"నేను చాలా బూతులు మాట్లాడొచ్చు. కానీ సంస్కారం అడ్డొస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన రాజేష్ టచ్ రివర్ అనే దర్శకుడుకి సంబంధించిన సెమినార్ జరుగుతుంటే మేం 3 గంటలు కూర్చున్నాం. అన్నీ గంటలు మేం ఏం మాట్లాడామనే చూసే ఓపిక లేదు. మూడు గంటల్లో ఒకటి ఎడిట్ చేసిన చిన్న క్లిప్ చూసి మీరు ట్వీట్ చేసి ఒకడ్ని తిట్టేస్తే అయిపోతుంది. మీరు నన్ను తిట్టారు. అందుకు మీకు సిగ్గు ఉండాలి. నేను నోరు విప్పితే చాలా ఉంటాయి. కానీ నాకు ఆ అవసరం లేదు" అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

అలాగే చచ్చిపోతాను..
"నిన్న గాక మొన్న నేను రాజమౌళి గారు గొప్పవాడన్నప్పుడు మీకది తెలియదా. ఎవడో ముక్క కట్ చేసి పెడితే తెలిసిందే. ఓ చిన్న సినిమా కోసం మూడు గంటలు టైమ్ స్పెండ్ చేయలగలరా. మీకు వాడికి వీడికి మర్దన చేయటానికే తప్ప దేనికి టైమ్ ఉంది. వాడి కాళ్లు పట్టుకోవడం. వీడి కాళ్లు పట్టుకోవడం తప్ప మీకైమైనా టైమ్ ఉందా. మీరా నా గురించి మాట్లాడేది. నేను నిజాయితీగానే ఉంటాను. అలాగే చచ్చిపోతాను. నేను ఏ ప్రభుత్వాన్ని స్థలం అడగలేదు. అవార్డు రివార్డ్ అడగలేదు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. నాకేం పర్లేదు" అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











