twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ కల్యాణ్‌‌పై తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్.. నిలకడ లేదు.. పదేళ్లుగా అదే తీరు అంటూ..

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల విరామం అనంతరం వకీల్ సాబ్‌తో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆయన కెరీర్, పొలిటికల్ జర్నీపై అనేక విధాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ...

    పవన్ కల్యాణ్‌‌ది రీ ఎంట్రీ కాదు

    పవన్ కల్యాణ్‌‌ది రీ ఎంట్రీ కాదు

    పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు, రీ ఎంట్రీ ఇస్తున్నారనే మాటను ఒప్పుకోను. ఎందుకంటే ఆయన సినిమా పరిశ్రమకు దూరంగా ఉండలేదు. గత మూడేళ్లలో సినిమాలు చేయకపోవచ్చు కానీ సినిమా పరిశ్రమతోనే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి పవన్ రీఎంట్రీ అంటే ఒప్పుకోను అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

    జగన్ పాలన బాగుందో లేదో తెలియదంటూనే

    జగన్ పాలన బాగుందో లేదో తెలియదంటూనే

    ఏపీలో వైఎస్ జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకొంటానని పవన్ కల్యాణ్ చెప్పారో నాకు తెలియదు.. అలాగే జగన్ పాలన బాగుందో లేదో నేను చెప్పలేను. ప్రస్తుతం ఆ మాటల అర్ధాన్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ దాదాపు 5 సినిమాలు చేస్తున్నాడు. అంటే జగన్ పాలన బాగుందని అనుకోవచ్చని అనుకొంటున్నాను అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

    జనసేన కోసం సినిమాలు చేయడం లేదు

    జనసేన కోసం సినిమాలు చేయడం లేదు


    జనసేన పార్టీ కోసం డబ్బు ఖర్చు చేయడానికే సినిమాలు చేస్తున్నారని అనుకోవడం లేదు. ఆయన ఎన్ని సినిమాలు చేస్తే పార్టీని నడిపే డబ్బు వస్తుంది. సినిమాకు 50 కోట్లు, 100 కోట్లు తీసుకొన్న గానీ.. ఆ డబ్బుతో పార్టీని నడిపేందుకు వీలు కాదు అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

    పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదు..

    పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదు..


    పవన్ కల్యాణ్‌ గురించి నాకు బాగా తెలుసు. ఆయన డబ్బు మనిషి కాదు. సినిమాల ద్వారా సంపాదించే డబ్బు ప్రజలకు, పార్టీకి ఖర్చుపెడుతారని నేను నమ్ముతాను. కానీ పార్టీని నడపడానికి పవన్ కల్యాణ్‌కు డబ్బు అవసరం లేదు. ఆయన ఒక్క మాట మీద నిలబడి ఉంటే ఆయనకు డబ్బు అక్కర్లేదు అని తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు.

     పవన్ గొప్ప నాయకుడు

    పవన్ గొప్ప నాయకుడు

    పవన్ కల్యాణ్‌కు డబ్బు అక్కర్లేదు. పవన్ గొప్ప నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాజకీయాల్లో ఆయన పద్దతిగా ఉంటే ఏదైనా చేయగలిగే సత్తా ఉంది. సీట్లు రాకపోయినా ఆయనలో గొప్ప నాయకత్వం లక్షణాలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉంది. కానీ ఆయనలో స్థిరత్వం లేదు అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

    ప్రజలే అతడిని కాపాడుతారు...

    ప్రజలే అతడిని కాపాడుతారు...

    పవన్ కల్యాణ్‌ను తప్పుపట్టడానికి ఎలాంటి అంశాలు లేవు. కానీ పార్టీ పరంగా తీసుకొనే నిర్ణయాల్లో స్థిరత్వం లేదు. 10 ఏళ్లుగా నిలకడగా లేకపోవడం వల్ల నలుగురిలో అభాసుపాలవుతున్నారు. ఒకవేళ నిలకడ ఉంటే ప్రజలే అతడిని కాపాడుతారు అని నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో

    మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో


    ఇదిలా ఉండగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పింక్ రీమేక్ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. కమ్ బ్యాక్ మూవీ అని చెబుతున్న ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు అద్భుతమైన స్పందనను దక్కించుకొన్నాయి.

    English summary
    Power Star Pawan Kalyan is coming with Vakeel Saab after 3 years of gap. This movie is set to release on April 9th. In this occassion, Producer and Director Tammareddy Bharadwaja made a sensational comments on Pawan Kalyan and Janasena Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X