twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో బతకాలంటే భజన చేయాలి.. లేకపోతే కష్టమే.. తమ్మారెడ్డి భరద్వాజ

    By Rajababu
    |

    Recommended Video

    ఇండస్ట్రీలో భజన చెయ్యాలి.. లేదా ఫేస్ బాగుండాలి

    శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం పడిపోయా నీ మాయలో. మహేష్ పైడ దర్శకత్వం వహిసున్న చిత్రానికి ,భరత్ అంకటి నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ రామకృష్ణ గౌడ్, ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.

     ఇండస్ట్రీలో భజన చేయాలి

    ఇండస్ట్రీలో భజన చేయాలి

    ఈ సందర్భంగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. డైరెక్టర్ మహేష్ ముఖం చూస్తే ఫైటర్‌లా ఉంది. ఇలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టమే. ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి లేదా ముఖమైన బాగుండాలి. లేకుంటే కష్టాలు తప్పవు అని అన్నారు.

     ఆర్కే టాలెంటెడ్ డైరెక్టర్

    ఆర్కే టాలెంటెడ్ డైరెక్టర్

    ప్రముఖ దర్శకుడు.ఎన్.శంకర్ మాట్లాడుతూ.. పడిపోయా నీ ప్రేమలో మంచి యూత్ ఫుల్ సబ్జెక్టు. సంతోషం, షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చిన దర్శకుడు ఆర్కే కాంపల్లి మంచి టాలెంట్ వున్నా దర్శకుడు. ఈ సినిమాను తప్పక అదరించాలి అని అన్నారు.

     అలా భయపడ్డాను..

    అలా భయపడ్డాను..

    పడిపోయా నీ మాయలో దర్శకుడు ఆర్కే కాంపల్లి మాట్లాడుతూ.. పదమూడు సంవత్సరాల నుంచి దర్శకత్వం వహించాలని ప్రయత్నిస్తున్నా. ఒక దశలో సినిమా తియ్యకుండానే చనిపోతానేమో భయపడ్డాను. మా నిర్మాతలు నాకు సహకారం అందించి నా కలను సాకారం చేశారు అని అన్నారు.

     13 ఏళ్ల అనుబంధం

    13 ఏళ్ల అనుబంధం

    పడిపోయా నీమాయలో నిర్మాత భరత్ అంకటి మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకుడు ఆర్కేతో నాకు పదమూడు సంవత్సరాల స్నేహం ఉంది. చాలా మంచి మనిషి. ఈ సినిమా చెయ్యడానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నాం. ఇబ్బందుల్లో ఉన్నామని మా నిర్మాత మహేష్ మమ్మల్ని ఆదుకున్నారు. ఈ సినిమా కథా కథనాలు చాలా ఆసక్తిగా ఉంటాయి అని అన్నారు.

    English summary
    Padipoya nee Mayalo movie audio released recently at Prasad Labs. Minister Eetela Rajender, Tammareddy Bhardwaja other film personalities are attended this event. In this program Tamma Reddy Bhardwaja revealed some interesting points of Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X