twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ బడ్జెట్ సినిమాల మీద తమ్మారెడ్డి ఫైర్.. సినిమా ధియేటర్లను కబ్జా చేసి.. డబ్బు దోచుకోవాలనుకుంటే ఎలా?

    |

    ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల విషయం మీద పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించడంతో భారీగా నష్టపోతుందని సినీ పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల చిరంజీవి నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ సినిమా టికెట్లు రేట్లు పెంచడమే కాక మరో 16 అంశాలకు సంబంధించి సమస్యలు విన్నవించుకుని వచ్చారు. అయితే సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్ల తగ్గింపు అనేది సమస్యే కాదని తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

     ఘాటుగా

    ఘాటుగా

    సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు వ్యవహారం అనేది టాలీవుడ్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కాదని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. టికెట్ రేటు తగ్గించడం అనేది ఒక సమస్య కాదని కానీ సినిమా ఇండస్ట్రీ సభ్యులు ప్రభుత్వం దగ్గరకు ఎందుకు ఎందుకు వెళ్లారో తనకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సదరు యాంకర్ ప్రశ్నించిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

     అసలు సమస్యే కాదు

    అసలు సమస్యే కాదు

    టికెట్ రేటు అనేది సినీ పరిశ్రమలో ఉన్న సమస్య అంటూ సదరు యాంకర్ ప్రస్తావించగా సినీ పరిశ్రమలో టికెట్ రేట్ల తగ్గింపు అనేది సమస్య కాదని, పరిగణించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద పోరాడాలని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలకు ఈ తక్కువ రేట్లతో టికెట్లు ఉండటం అనేది సమస్యే కదా అని యాంకర్ ప్రస్తావించగా అది అసలు సమస్యే కాదని చిన్న సినిమాని తక్కువ ధియేటర్లు ఇస్తున్నారు కానీ పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లు ఇస్తున్నారు కదా అని ప్రశ్నించారు.

    ఇంకా రేట్లు పెంచమని

    ఇంకా రేట్లు పెంచమని

    ఉదాహరణగా చెబుతూ ఆర్.నారాయణమూర్తి నటించిన 60 సినిమా స్క్రీన్లలో వేస్తే పెద్ద సినిమాలను మాత్రం దాదాపు ఉన్న నాలుగు వేల స్క్రీన్లలో ప్రదర్శిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.. కావాలంటే అదే 60 స్క్రీన్లలో నారాయణమూర్తి సినిమా కాకుండా పెద్ద సినిమా వేసి వాళ్లకు కావాల్సిన విధంగా పది వేల రూపాయల టిక్కెట్లు పెట్టుకోమని సవాల్ విసిరారు. ఊర్లో ఉన్న అన్ని సినిమా ధియేటర్లను కబ్జా చేసి ఇంకా రేట్లు పెంచమని అడుగుతూ ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

    దొరికి ఉండకపోవచ్చు

    దొరికి ఉండకపోవచ్చు

    అంతేకాక జనాల డబ్బు మొత్తం దోచుకోవాలని అనుకుంటున్నారా? ఆ దోచుకోవడాన్ని మీరు సమర్ధిస్తున్నారా అంటూ యాంకర్ మీదనే రివర్స్ అయ్యారు. దీంతో సదరు యాంకర్ కూడా మరి చిరంజీవి లాంటి వారు వెళ్లి ఎందుకు ఈ సమస్య మీద వైఎస్ జగన్ ను కలిసి వచ్చారు అని ప్రశ్నించారు. బహుశా చిరంజీవి గారికి నాలాగా వివరించి చెప్పేవారు ఎవరు దొరికి ఉండకపోవచ్చు అందుకే ఆయన టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం పెద్ద సమస్యగా భావించి వైయస్ జగన్ దగ్గరకు వెళ్ళి ఉండవచ్చు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

     రేట్లు తక్కువగా ఉన్నప్పుడే

    రేట్లు తక్కువగా ఉన్నప్పుడే

    బాలక్రిష్ణ ప్రస్తావన సదరు యాంకర్ తీసుకురాగా నిజమే కదా అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, డీజే టిల్లు వంటి సినిమాలు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే విడుదలయ్యాయి కానీ మంచి విజయాన్ని సాధించి అద్భుతమైన కలెక్షన్లు కూడా సాధించియాయి కదా అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఆ సినిమాలకు లేని సమస్య పెద్ద సినిమాలకు ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు.

    English summary
    tammareddy bharadwaja serious comments on big budget movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X