twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి, మహేష్‌ను కెలుకొద్దు.. వారి మధ్య శతృత్వం లేదు.. గొడవలు పెట్టొద్దు: తమ్మారెడ్డి

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో ముక్కుసూటిగా మాట్లాడే వారిలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఎలాంటి విషయంపై కూడా ముందు, వెనుక ఆలోచించకుండా నిక్కచ్చిగా మాట్లాడుతారని చెప్పుకొంటారు. తాజాగా యూట్యూబ్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన భగ్గుమన్నారు. మూవీ ఆర్ట్సిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో ఓ యూట్యూబ్‌ వీడియోలో పేర్కొన్న అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..

    మా ఎన్నికల నేపథ్యంలో

    మా ఎన్నికల నేపథ్యంలో

    మా ఎన్నికల్లో శివాజీ రాజా, నరేష్ ప్యానెల్ అందరి మద్దతు కూడగట్టారు. ఇండస్ట్రీలో అగ్ర హీరోలు చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోల మద్దతు కోరారు. అయితే కొందరు మీడియాలో దానిని తప్పుదోవ పట్టించే విధంగా కథనాన్ని అల్లారు అని తమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

     చిరంజీవి, మహేష్ పోటీనా?

    చిరంజీవి, మహేష్ పోటీనా?

    శివాజీ రాజా ప్యానెల్‌కు చిరంజీవి, నరేష్ ప్యానెల్‌కు మహేష్ బాబు మద్దతు తెలిపారని, వారిలో ఎవరు ప్యానెల్ గెలుస్తుంది.. చిరంజీవి, మహేష్ బాబులో ఎవరు గెలుస్తారనే అర్థం వచ్చే విధంగా ఫొటో పెట్టారు. మహేష్, చిరంజీవి పోటీ పడుతున్నట్టు క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో ఇది సరికాదు అని అన్నారు.

    ఇండస్ట్రీ అంతా ఒకటి కాదు

    ఇండస్ట్రీ అంతా ఒకటి కాదు

    ఇండస్ట్రీ అంతా ఒక్కటి కాదు. అయితే ఎన్నికలు జరుగవు. కానీ వ్యక్తిగతం వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. పరిశ్రమలో ఏదైనా సమస్య వస్తే అందరం కలిసి పరిష్కరించుకొంటాం. ఇలాంటి వాటికి చిరంజీవి, మహేష్ లాంటి వాళ్లు అండగా ఉంటారు. కాబట్టి అలాంటి వారిని అనవసరమైన వార్తలతో కెలకవద్దు అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

    శత్రుత్వం, పోటీ లేదు.

    శత్రుత్వం, పోటీ లేదు.

    చిరంజీవి, మహేష్ బాబు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. పోటీ పడే మనస్తత్వం లేదు. వీడియోలకు అనవసరమైన థంబ్ నెయిల్స్ పెట్టొద్దు. అలాంటివి ఎదైనా సమస్యకు దారితీస్తే వారిద్దరూ మనస్తాపం చెందే అవకాశం ఉంది. వారిద్దరూ ఇండస్ట్రీకి పెద్ద తలకాయలుగా ఉంటున్నారు. వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

    ఇండస్ట్రీకి చిరంజీవి పెద్దగా

    ఇండస్ట్రీకి చిరంజీవి పెద్దగా

    దాసరి నారాయణరావు మనమధ్యలేరు. ఆయన బాధ్యతను ఇటీవల రెండు మూడు సందర్భాల్లో చిరంజీవి తీసుకొన్నారు. కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించారు. కాబట్టి ఆయన, మరో హీరో మధ్య విభేదాలు సృష్టించే పనులు చేయకండి. ఇలాంటి సీరియస్ విషయాలను వ్యూస్, ట్రాఫిక్ కోసం జోక్‌గా మార్చొద్దు అని తమ్మారెడ్డి సూచించారు.

    English summary
    Tammareddy Bharadwaj Shocking Comments on Chiranjeevi & Mahesh Babu Over Artists Welfare at MAA Association Press Meet. He said, Dont put controversy videos in Youtube channels.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X