Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాడికెందుకు? వాడి అయ్య జాగీరా?.... ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఇష్యూపై ఫైర్!
అర్జున్ రెడ్డి ఆడియో వేడుకలో తమ్మారెడ్డి సంచలనం. సినిమాపై విమర్శలు చేసిన వారిని తిట్టిపోశారు.
విజయ్‌దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాత. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సంచలనకామెంట్స్ చేశారు.
'అర్జున్ రెడ్డి' సినిమా 3 గంటలు తీయడాన్ని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేయడంపై తమ్మారెడ్డి స్పందిస్తూ..... వాడికెందుకయ్యా? వాడి అయ్య జాగీరా? మూడు గంటలు సినిమా తీస్తడు, 30 గంటలు సినిమా తీస్తడు. నిర్మాత, దర్శకుడు, హీరో సినిమాను నమ్ముకుని సినిమా తీస్తారు అని వ్యాఖ్యానించారు.
వాడి పైసలా? నచ్చకపోతే చూడకు
సోషల్ మీడియాలో 3 గంటలట సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు... ఏమైతది? వాడి పైసలా? నచ్చకపోతే వాడు చూడొద్దు? అంటూ ఘాటుగా స్పందించారు తమ్మారెడ్డి.
Recommended Video
ముద్దు పెట్టుకుంటే నీదేంబోయిందయ్యా?
ఇంకోడెవడో వస్తడు... ముద్దు పెట్టుకున్నారంట ఏందయ్యా అని? విమర్శిస్తడు. ముద్దు పెట్టుకుంటే నీదేంబోయిందయ్యా? రాకు నువ్వు థియేటర్‌కు? అన్నీ వీళ్లకే కావాలి. పోనీ మంచి సినిమా తీస్తే చూస్తరా? అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు తమ్మారెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్లను చించేసిన సంగతి తెలిసిందే.
నువ్వేమైనా హెల్ప్ చేస్తవా?
ముద్దు పెట్టడు, మూడు గంటలు సినిమా తీయడు నువ్వు రిలీజ్ చేస్తవా? హెల్ప్ చేస్తవా? ఎవ్వడేం చెయ్యడు. సోషల్ మీడియాలో, రాజకీయ నాయకులు, కొందరు పిచ్చోళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్లు ఊరికే దొరికారు కదా అని ఎవరు పడితే వారు రాయి వేయడం అలవాటయిపోయింది... అని తమ్మారెడ్డి మండి పడ్డారు.
వాళ్లని బాయ్ కాట్ చేయండి
ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ప్రేక్షకులు మాకు సపోర్టుగా ఉన్నారు. సోషల్ మీడియాలో అలా మాట్లాడే వారిని మీరంతా బాయ్ కాట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.