twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమ్మారెడ్డి రాజీనామా కారణం...

    By Staff
    |

    Tammareddy Bharadwaj
    తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేవారిలో మొదట వినిపించే పేరు.. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెలుగు నిర్మాతల మండలి అధ్యక్ష్య పదివికి 20 రోజుల క్రితం ఆయన తన పదవికి రాజీనామా చేసారు. ఈ పరిణామం పరిశ్రమలో చాలామందిని ఆశ్చర్యపరచింది.

    అసలెందుకు రాజీనామా చేయలసి వచ్చిందన్నదానికి ఆయన సమాధానంగా...ఇప్పటివరకు నేను ఏ సంఘంలో ఏ పదవిని చేసినా, అది నాకై నేను చేపట్టింది కాదు. ఎవరో ఒకరు నెడితేనే ఆ పదవిని చేపట్టా. కానీ పరిశ్రమకు ఏదైనా మేలు చేద్దామనే ఉద్దేశంతో జీవితంలో తొలిసారి నాకై నేను మనస్ఫూర్తిగా ఈసారి నిర్మాతల మండలి అధ్యక్షుణ్ణయ్యా. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల నేను సౌకర్యంగా లేను. ఇక్కడి విధానాలకు నేను అడ్జస్ట్‌ కాలేకపోతున్నా. అందుకే నా పదవీ కాలం 2009 సెప్టెంబర్‌ వరకు వున్నప్పటికీ మండలి అధ్యక్ష పదవికి 20 రోజుల క్రితం రాజీనామా సమర్పించా. మండలి సభ్యులు ఇంకా దాన్ని ఆమోదించలేదు అని అసంతృప్తిగా మీడియా వద్ద వెళ్ళడించారు. అలాగే అడ్జెస్ట్‌ కాలేకపోతున్న ఆ విధానాలేమిటి అన్నదానికి అవన్నీ బయిటికి చెప్పలేనివని... అంతర్గతమైనవని వెల్లడించారు.

    ఇక ఈ నిరాహార దీక్ష పట్ల తొలిసారి పెదవి విప్పుతూ..సమస్యల పరిష్కారం కోసమంటూ కొంతమంది నిర్మాతలు అలా రిలే నిరాహార దీక్షా శిబిరం పెట్టడం వంద శాతం తప్పు. థియేటర్ల అద్దెలు తగ్గడం అవసరమే. పర్సంటేజ్‌ విధానం కావాల్సిందే. దానికోసం ఇప్పుడు టెంట్‌ వేయడం ఎందుకు? రెండు నెలల నుంచి ఈ సమస్యలపై ఫిల్మ్‌చాంబర్‌లో, మండలిలో చర్చలు జరుగుతూనే వున్నాయి కదా . అయినా ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పుడు టెంట్‌ వేయడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం కరెక్ట్‌ కాదు అన్నారు.

    ఇక బాబు మోహన్ విషయమై స్పందిస్తూ..బాబూమోహన్‌వి వ్యాపారం తెలీక మాట్లాడుతున్న మాటలు..డిస్ట్రిబ్యూటర్‌ వెనుక కొంతమంది సినీ పెద్దలున్నారని ఆరోపించడం, వారి బండారం బయటపెడతానని బెదిరించడం.. ఇలాంటివి చేసేది రాజకీయ నాయకులే. ఇలా ఆరోపించడం వారికి ఒక అలవాటుగా మారింది. డిస్ట్రిబ్యూటర్‌ వెనుక వున్నవాళ్లెవరో ఆయన బయటపెట్టొచ్చు కదా అంటూ చెప్పుకొచ్చారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X