twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైవ్ ఇస్తుంటే ఆపలేని సెన్సార్..తమ్మారెడ్డి భరద్వాజ

    By Srikanya
    |

    ''స్వాముల అరాచకాలను వివిధ చానల్స్‌లో లైవ్ చూపించినపుడు ఏమీ చేయలేని సెన్సార్,సినిమా తీస్తుంటే ఎందుకు అభ్యంతరం చెబుతోందో అర్థం కావడం లేదు""అని తమారెడ్డి భరద్వాజ్ సెన్సార్ పై మండిపడ్డారు.రవిచేతన్‌ హీరోగా నటించిన చిత్రం 'స్వామి సత్యానంద'ఆడియో పంక్షన్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది.ఈ సందర్భంగా ఆ పంక్షన్ కి హాజరైన భరద్వాజ ఇలా స్పందించారు.అదే సమయంలో ఆడియోను ఆవిష్కరించిన కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ -''తెలుగులో తెలుగు నటులకు అవకాశాలు దక్కడం లేదు. ఎక్కడెక్కడినుంచో నటనరాని వాళ్లను తీసుకొచ్చి నటన నేర్పి మరీ డబ్బులిచ్చి పంపిస్తున్నాం. నసీరుద్దీన్‌షా, నానాపటేకర్ లాంటి ప్రముఖుల్ని తీసుకొచ్చి నటింపజేస్తే ఒక అర్థం కానీ, ఇదేం పద్ధతి?""అని ప్రశ్నించారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ప్రజల బలహీనతను సొమ్ము చేసుకొంటున్న దొంగ స్వామీజీల చుట్టూ తిరిగే కథ ఇది. నేటి పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రానికి నేనే స్వరాలు సమకూర్చాన''న్నారు. ''ప్రత్యేకంగా ఒకర్ని ఉద్దేశించి తీసిన చిత్రం కాదిది. అయినప్పటికీ సెన్సార్‌ అధికారులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రచార చిత్రాల్ని సెన్సార్‌ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. చిత్రాన్ని ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్నకుమార్‌, వజ్జా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Debutant Madan Patel is directing a film titled Swamy Satyananda.The film’s audio release function was held at Film Chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X