"ఆ పరిస్థితి వస్తే చెప్పుతో కొడతాం, సినిమా వాళ్ల పెళ్లాలపై ఇంత నీచంగానా?"

సినిమా వాళ్ల భార్యల గురించి నీచంగా మాట్లాడిన ఎంపీ చింతామని మాలవీయపై తమ్మారెడ్డి ఫైర్.

By Bojja Kumar

బిజేపీ ఎంపీ చింతామణి మాలవీయ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి భార్యల గురించి చేసిన కామెంట్ మీద ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యారు. "సినిమాలు తీసే వారి కుటుంబాల్లో మహిళలు ప్రతి రోజూ భర్తలను మార్చేస్తుంటారు. దుష్టమనస్తత్వాలతో తనను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాను" అంటూ... చింతామణి చేసిన కామెంట్లపై తమ్మారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Recommended Video

"Trailer Is Very Good" Tammareddy Bharadwaj Says అరాచకపు బ్యాచ్ చేసిన సినిమా ఇది
స్త్రీని కించ పరుస్తూ మాట్లాడటం సరికాదు

స్త్రీని కించ పరుస్తూ మాట్లాడటం సరికాదు

వ్యక్తి మీద కోపం వస్తే కోపం వచ్చిన వ్యక్తిని తిట్టొచ్చు కానీ, సినిమా వాళ్ల కుటుంబాల్లో ఉన్న మహిళలందరినీ, అందులోనూ ఎంపీ అయి ఉండి ఇలా... స్త్రీని కించ పరుస్తూ మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఇంతకు ముందు కూడా కొందరు సినిమా వాళ్ల గురించి చాలా నీచంగా మాట్లాడారు.... అని తమ్మారెడ్డి అన్నారు.

 ఇపుడంతా మామూలు అయిపోయింది

ఇపుడంతా మామూలు అయిపోయింది

గతంలో కమల్ హాసన్ గురించి ఆయన పెళ్లాలను మార్చాడని రకరకాలుగా మాట్లాడారు. ఈ దేశంలో విడాకులు మామూలు అయిపోయాయి. వివాహాలు చేసుకుంటున్నారు, కొత్త మొగుళ్లు వస్తున్నారు, కొత్త పెళ్లాలు వస్తున్నారు. ప్రపంచం అంతా ఇది మామూలు అయిపోయింది.... అని తమ్మారెడ్డి అన్నారు.

 వాళ్లకు లేని సంస్కారం నాకు ఉంది

వాళ్లకు లేని సంస్కారం నాకు ఉంది

ఈ రోజు ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రెండో వివాహం, మూడో వివాహం చేసుకోలేదా? వాళ్లు కాదా? వాళ్ల పేర్లు చెబితే బాగోదు. వాళ్లను కించపరచడం నాకు ఇష్టం లేదు. వాళ్లకు లేని సంస్కారం నాకు ఉంది. అందుకనే ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు.... అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

మేము కూడా చెప్పుతో కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది

మేము కూడా చెప్పుతో కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది

ఏదైనాగానీ జనరలైజ్ చేసి సినిమా వాళ్ల పెళ్లాలు ఎవరితోనో వెళ్లి పోతారు అనడం క్షమించరాని నేరం. దీన్ని మనం ఖండించకుండా ఊరుకోవడం చాలా కష్టం. ఆయన ఏదో కోపం వస్తే చెప్పు తీసుకుని కొడతాం అన్నారు. నిజంగా ఆ పరిస్థితి వస్తే మేము కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది.... అని తమ్మారెడ్డి అన్నారు.

పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా?

పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా?

సినిమా వాళ్ల పెళ్లాలు అంత తేరగా దొరికారా? ఏమనుకుంటున్నాడతడు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఎంపీలైనంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడటానికి అధికారం లేదే... వ్యక్తి మీద కోపం వస్తే వ్యక్తిని తిట్టండి. ఇండస్ట్రీ మొత్తాన్ని, వారి భార్యలను అనడం సరికాదు. ఆ హక్కు ఎవరు ఇచ్చారు..... అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు.

ఇండస్ట్రీ మొత్తం ఏకం అయితే ఏమవుతుందో తెలియదు ఖబడ్దార్

ఇండస్ట్రీ మొత్తం ఏకం అయితే ఏమవుతుందో తెలియదు ఖబడ్దార్

"చేతిలో ప్రభుత్వం ఉంది కదా అని ఏది పడితే అది చేయొచ్చు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు ఇది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకం అయితే ఏమవుతుందో తెలియదు. చూపిస్తాం.... చూపించాల్సిన పరిస్థితి వస్తే చూపిస్తాం ఖబడ్దార్" అంటూ..... తమ్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X