తమ్మారెడ్డిపై బుసలు కొడుతున్న తెలుగు హీరోలు!
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి. పైకి ఏమీ అనలేకపోయినా...లోలోన హీరోలందూ ఆయన పై గరం గరంగా ఉన్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే... చిల్డ్రన్స్ ఫెస్టివల్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మన హీరోలు అమీర్ ఖాన్ లా 'తారే జమీన్ పర్" వంటి సందేశాత్మక చిత్రాలు తీయడానికి ముందుకు రావడంలేదెందుకని విలేకరులు అడగ్గా? 'మన హీరోల్లో మగాళ్లు" లేరని.. అమీర్ ఖాన్ లా గట్స్ మనాళ్లలో ఎవరురున్నాయని ఎదురు ప్రశ్రించారు. దీంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది.
ఇదే విషయాన్ని కొంతమంది హీరోలు, దర్శకుల వద్ద ప్రస్తావించగా 'ఆఫ్ ది రికార్డ్" అంటూ ఆయన ఇప్పటివరకు ఎన్ని చిత్రాలు తీశారు? ఎన్ని హిట్ అయ్యాయో ఒక్కసారి ఆయనకు ఆయన్నే ప్రశ్నించుకోవాలిని.. ఆయన కెరీర్ లో 'పచ్చనిసంసారం" తప్ప మరో హిట్ లేదంటూ వెళ్ళిపోయారు. 'మన హీరోల్లో మగాళ్లు లేరు" అంటే... అందరూ హీరోయిన్లేనా అంటూ మరికొందరు చమత్కరించారు.


Click it and Unblock the Notifications











