'వాళ్లు సినీ పరిశ్రమకు పట్టిన దరిద్రం'

By Bojja Kumar

'నిర్మాతల మండలికి సంబంధించిన పదవుల్లో ఉన్నవాళ్లలో సినిమాలు తీసేవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. తీయనివాళ్లే ఎక్కువ. వాళ్లు పరిశ్రమకు పట్టిన దరిద్రం. వాళ్లు పోతే ఇండ్రస్ట్రీ బాగు పడుతుంది' అంటూ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ఈ రోజుల్లో' చిత్రం సక్సెస్ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ దాదాపు ఆరు నెలల క్రితం బడ్జెట్ నియంత్రించాలనే విషయమై నిర్మాతలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అప్పుడు బడ్జెట్, డిస్ట్రిబ్యూషన్ గురించి చర్చలు వచ్చాయి. పెద్ద బడ్జెట్‌తో తీయడం కంటే...మంచి కథాబలం ఉన్న సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు అని నేను వాదించాను. దీంతో కొంత మంది నిర్మాతలు నన్ను కొట్టినంత పని చేశారు. కానీ 'ఈ రోజుల్లో' లాంటి చిత్రాలు ఆ మాటలను నిరూపిస్తున్నాయి. ఈ చిత్రంలో నేను నిర్మాత పాత్ర చేశాను. మా స్టూడియోలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరిగాయి. వీళ్లు రిలీజ్ చేయగలుగుతారో లేదో అనుకున్నాను. నాకు తోచిన సహాయం చేశాను అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో బూతులున్నాయి...'యు' సర్టిఫికెట్ ఎలా ఇస్తారని కొంత మంది నిర్మాతలు సెన్సార్ బోర్డు వరకు వెళ్లారు. కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి స్పందనే వస్తోంది. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్లో పాల్గొన్నప్పుడు ఇదే విషయాన్ని నేను విద్యార్థులను అడిగితే రోజూ మనం మాట్లాడుకునే మాటలే ఉన్నాయని వారు చెప్పారని.....తమ్మారెడ్డి వెల్లడించారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ తమ సినిమాలో నిర్మాతగా నటించాలని కొందరు నిర్మాతలను అడిగితే మాతోనే సినిమా రిలీజ్ చేయించాలనుకుంటున్నారా? అంటూ ఎగతాళి చేశారు. కానీ తమ్మారెడ్డిగారు వెంటనే చేయడానికి ఒప్పుకోవడంతో పాటు, తమకు అన్ని విధాలా సాయం చేశారని అన్నారు.

డబ్బులుంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారని, అమ్మాయిలంతా కమర్షియల్ అయిపోయారని బలంగా విశ్వసించే మనస్తత్వంతో ఈ సినిమా హీరో పాత్ర వుంటుంది. అదే సమయంలో అబ్బాయిల స్నేహంలో నిజాయితీ వుండదని, వారు అమ్మాయిల పట్ల ఎక్కువగా శారీరక ఆకర్షణనే పెంచుకుంటారని భావించే మనస్తత్వాన్ని కలిగిన పాత్ర కథానాయికది. ఇలా భిన్న ధృవాలుగా వున్న వీరిద్దరి జీవిత ప్రయాణమే 'ఈ రోజుల్లో' చిత్ర కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X