twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా వాడు అనొద్దు... అతడో పింప్: సెక్స్ రాకెట్‌పై తమ్మారెడ్డి రియాక్షన్

    By Bojja Kumar
    |

    ఇటీవల అమెరికాలో పట్టుబడ్డ సెక్స్ దందాలో తెలుగు నిర్మాత పేరు బయటకు రావడం, కొందరు తెలుగు హీరోయిన్లతో అతడు చికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు అమెరికా పోలీసులు తేల్చడంతో మరోసారి టాలీవుడ్ చిత్రసీమ వార్తల్లో నిలిచింది. గతంలోనూ వ్యభిచారం, డ్రగ్స్, ఇతర నేరాల విషయంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు పట్టుబడటంతో ఇండస్ట్రీపై నెగెటివ్ ప్రచారం మొదలైంది. ఇలాంటివి జరిగినప్పుడల్లా కొందరు తెలుగు సినీ ప్రముఖులు తెరపైకి వచ్చి ఎవరో ఒకరు చేసిన తప్పును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించవద్దు అంటూ కోరుతూనే ఉన్నారు. తాజా పరిణామాలపై తమ్మారెడ్డి స్పందించారు.

    Recommended Video

    మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతుల ఇంట్లో భారీ ఎత్తున కండోమ్స్
    ఇండస్ట్రీ మీద మచ్చ వేస్తున్నారు, బాధగా ఉంది

    ఇండస్ట్రీ మీద మచ్చ వేస్తున్నారు, బాధగా ఉంది

    "ప్రపంచంలో ఎక్కడ జరిగినా తెలుగు సినిమా మీద మచ్చ వేస్తున్నారు. ఇది కొంచెం బాధగా ఉంది. వాళ్లు ఎవరో తెలియదు. ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో ఉండి ఉండొచ్చు లేక పోవచ్చు. వాళ్లు సినిమా నటీమణులను ఇక్కడ నుండి అమెరికా తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్స్ చేయిస్తూ పడుపు వృత్తి చేయించారనే అభియోగాలు ఉన్నాయి... అవి అభియోగాలు కాదు నిజమే. దాని మీద వారిని అరెస్టు చేశారు. కొంత మంది విక్టిమ్స్‌ను కూడా కాపాడారు. అయితే తెలుగు ఇండస్ట్రీతో లింకు పెట్టడం బాధగా ఉంది" అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    పింప్ అనకుండా సినిమా వాడు అనడం ఎందుకు?

    పింప్ అనకుండా సినిమా వాడు అనడం ఎందుకు?

    ఇక్కడ సమస్య ఏమిటంటే.. వెళ్లిన వారు సినిమా వాళ్లా? కాదా? అనేది పూర్తిగా తెలియదు. పట్టుబడ్డ మొగుడు పెళ్లాల్లో అతడు ఎప్పుడో సినిమాల్లో నిర్మాతగా పని చేశాడని చెబుతున్నారు. ఇక్కడ మాకు అభ్యంతరం ఏమిటంటే... ఏం జరిగినా సినిమా వారే అంటున్నారు. సమాచారంలో ఎంతో మంది వ్యభిచారం చేస్తున్నారు.... పింప్స్ ఎంతో మంది ఉన్నారు. మీడియా వారు అతడిని పింప్ అనకుండా ప్రొడ్యూసర్ అని, సినిమా వాడు అని ఎందుకు అంటున్నారు? వాడెవడో తప్పుడు పని చేస్తే ఇందులోకి సినిమా ఇండస్ట్రీని లాగడం ఎంత వరకు న్యాయం? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

    మన వాళ్లని మనమే దూరం చేసుకుంటున్నాం

    మన వాళ్లని మనమే దూరం చేసుకుంటున్నాం

    సినిమా ఇండస్ట్రీపై మంచి ఉంటే మంచి రాయండి, చెడు ఉంటే చెడు రాయండి... రివ్యూలు రాయండి. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. కానీ లేనిది ఉన్నట్లు రాయడం, ఎవరో ఏదో అన్నారని ఆధారాలు లేకున్నా జనాలను అట్రాక్ట్ చేయడానికి వార్తలు రాయడం వల్ల ఆ ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద తీవ్రంగా పడుతోంది. దీంతో సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఆడవారు భయపడుతున్నారు. ఇప్పటికే మన తెలుగు లేడీస్ సినిమాల్లోకి రావడం బాగా తగ్గిపోయింది. ఈ పరిణామాలు ఇలానే కొనసాగితే తెలుగు ఆడవారు తెలుగు సినిమాల్లో లేకుండా పోతారు. ఒక పక్కన మన వాళ్లు మన సినిమాల్లో రావాలని మనమే చెబుతున్నాం. మరో వైపు మనవాళ్లు రాకుండా బయపడేలా ప్రచారం చేస్తున్నాం.... అని తమ్మారెడ్డి అన్నారు.

    ఇకపై ఇబ్బంది పడకుండా ఉండాలంటే

    ఇకపై ఇబ్బంది పడకుండా ఉండాలంటే

    ఇక మీద అమెరికా వెళ్లే సినీ తారలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిల్మ్ చాంబర్ ద్వారా వెళితే మంచిది. అమెరికాలో పట్టుబడ్డ దంపతులు వారి అసలు పేర్లతో కాకుండా వేరే పేర్లతో చలామణి అయ్యారు. ఎవరికీ కనబడలేదు. ఆ అమ్మాయి కనబడింది కానీ ఆ అబ్బాయి ఎవరికీ కనిపించలేదట. ఇంతగా మనిషి కనబడకుండా వ్యాపారం చేస్తుంటే మీరు ఎలా వెళ్లారు? కేవలం ఫోన్లో మాట్లాడి, వారు పంపిన ఈ మెయల్స్ నమ్మేసి వెళితే ఇబ్బందులు తప్పవు ఇకపై అయినా జాగ్రత్తగా ఉండాలని తమ్మారెడ్డి సూచించారు.

    అమెరికా తెలుగు సంఘాలు కూడా బాధ్యులే

    అమెరికా తెలుగు సంఘాలు కూడా బాధ్యులే

    తెలిసో తెలియకో అమెరికా తెలుగు సంఘాల వారు కూడా ఇలాంటి సెక్స్ దందాలు జరుగడానికి బాధ్యులు అవుతున్నారు. ఇలాంటి నేరాలు చేసే వారు మీ సంఘాల పేరు మీదనే వీసాలు ఇప్పిస్తున్నారు, మీ సంఘాల పేరుతోనే లెటర్ హెడ్స్ ద్వారా ఇన్విటేషన్స్ పంపుతున్నారు. ఇలాంటి జరుగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలుగు సంఘాలపై కూడా ఉంది. ఈ విషయంలో మీరు ఆలోచించక పోతే మీతో పాటు మన తెలుగు వారందరికీ సిగ్గు చేటు. మనందరం తలవంచుకునే విషయం ఇపుడు జరిగింది. ఇకపై ఇలాంటివి జరుగకుండా తెలుగు సంఘాలు బాధ్యత తీసుకోవాలి అని తమ్మారెడ్డి సూచించారు.

    English summary
    Tollywood Veteran Director Tammareddy Bharadwaj Opens Up about Telugu couple arrested in US for running abuse deeds with Tollywood actresses. He requests Media to provide right information and don't blame film industry for unnecessary things. Finally, he says that all people make mistakes but the media are made up of people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X