టాలీవుడ్ సెక్స్ రాకెట్: హీరోయిన్ల పిచ్చి పనులు, ఆ హీరోయిన్ల పేర్లు ఉన్నాయి అంటూ.. తమ్మారెడ్డి!
Recommended Video

టాలీవుడ్ సెక్స్ రాకెట్ అంశం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. చికాగోలో టాలీవుడ్ హీరోయిన్ల వ్యభిచారం బట్టబయలైన తరువాత ఈ అంశం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడారు. ఈ వ్యవహారంలో ఇరుక్కుని ఇండస్ట్రీ పరువుతీస్తున్న హీరోయిన్స్ పై ఆయన నిప్పులు చెరిగారు. హీరోయిన్స్ వారి సొంత నిర్ణయాలతో అమెరికా ఈవెంట్స్ కు వెళుతుండడం వలనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తమ్మారెడ్డి అన్నారు.

అందరి పేర్లు చెబుతున్నారు
ఇటీవల అమెరికాలో బట్టబయలైన సెక్స్ రాకెట్ విషయంలో ఎవరిని అడిగినా ఆ హీరోయిన్ ఉంది, ఈ హీరోయిన్ ఉంది అని పేర్లు కూడా చెబుతున్నారు. నాలుగైదేళ్ల నుంచి అమెరికాకు వెళుతున్న హీరోయిన్స్ పేర్లన్నీ చెబుతున్నారని తమ్మారెడ్డి అన్నారు.

ఈ సమస్య అంతా
ఇండస్ట్రీలో లేనివారిని కూడా హీరోయిన్సే అని చెప్పేస్తున్నారు. సమస్య మొత్తం హీరోయిన్లు సొంత నిర్ణయాలతో అమెరికాకు వెల్ళడం వలనే అని తమ్మారెడ్డి అన్నారు. మా అసోసియేషన్ తో మాట్లాడి ఎందుకు వెళ్లడం లేదు అని ప్రశ్నించారు.

అలా చేస్తేనే
హీరోయిన్స్ అమెరికా వెళ్లే సమయంలో ఈ ఈవెంట్ కు వెళుతున్నారు, ఎవరి ద్వారా వెళుతున్నారు వంటి విషయాలు తెలియజేస్తే వారిపై బాధ్యత ఉంటుందని అన్నారు.

అమెరికా నుంచి ఫోన్ చేస్తే
అమెరికా నుంచి ఎవడో ముక్కు మొత్తం తెలియని వాడు ఫోన్ చేస్తే వాడిని నమ్మి వెళతారు. కానీ ఇండస్ట్రీకి సంబందించిన వాళ్ళు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయరని తమ్మారెడ్డి హీరోయిన్స్ ని విమర్శించారు.

హీరోయిన్స్ పిచ్చి పనులు
హీరోయిన్లు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వలనే వాళ్ళ పరువుతోపాటు ఇండస్ట్రీ పరువు కూడా తీస్తున్నారని విమర్శించారు.

ఛండాలపు పనులు
ఇండస్ట్రీ ఇలా మాటలు పడాల్సిరావడానికి కారణం కోఆర్డినేటర్లు కూడా అని తమ్మారెడ్డి దుయ్యబట్టారు. వారు చేస్తున్న ఛండాలపు పనుల వలన పెద్ద వివాదం జరుగుతోంది. కోఆర్డినేటర్లు పద్దతిగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని తమ్మారెడ్డి హెచ్చరించారు.
తెలుగువారికి సిగ్గు చేటు
హీరోయిన్స్ ఇకనైనా మా అసోసియేషన్ ద్వారా ఈవెంట్స్ కు హాజరు కావాలని తమ్మారెడ్డి కోరారు. లేకపోతే ఇలాగె పోలీసుల చేతిలో అరెస్ట్ అయి సిగ్గుతో చచ్చిపోతారని హెచ్చరించారు. కొంతమంది అమెరికాకు వెళ్లి ఇలాంటి నీచపు పనులు చేస్తూ తెలుగువారికి సిగ్గు చేటుగా మారారని అన్నారు.


Click it and Unblock the Notifications











