బిగ్ బాస్‌లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన తమ్మారెడ్డి.. 6 నెలల నుంచి వాళ్లకు అదే పని!
Recommended Video

బిగ్ బాస్ 2 షో రసవత్తరంగా మారుతోంది. వారాలు గడిచేకొద్దీ ఒక్కొక్కరుగా షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. చివరకు మిగిలేది ఎవరు.. విజేత ఎవరు అనే ఆసక్తి కూడా ఆడియన్స్ లో నెలకొని ఉంది. తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినీ రాజకీయ అంశాలపై తరచుగా మాట్లాడే దర్శక నిర్మాత తమ్మారెడ్డి బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ లో ఈ సారి విజేత ఎవరో తమ్మారెడ్డి జోస్యం చెప్పారు.

కంటెస్టెంట్స్ అంతా
ఈ సారి బిగ్ బాస్ లో విచిత్రమైన కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసారని తమ్మారెడ్డి అన్నారు. కొన్ని విభాగాలలో పాపులర్ అయిన వారిని, ఇటీవల ఎక్కువగా వివాదాలలో నిలిచిన వారిని బిగ్ బాస్ షో కు ఎంపిక చేసుకున్నారని తమ్మారెడ్డి తెలిపారు.

ఆడియన్స్ కోసమే
ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసమే వివాదంలో ఉన్నవారిని తీసుకున్నారని తమ్మారెడ్డి తెలిపారు. సింగింగ్ లో పాపులర్ అయిన గీతా మాధురి, టివి చర్చలతో గుర్తింపు పొందిన బాబు గోగినేని వంటి వారిని ఎంపిక చేసుకున్నారు.

ఆరు నెలల నుంచి
కొంతమంది ఆరు నెలల నుంచి బిగ్ బాస్ షోలో ఎంపికయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వివాదాలని క్రియేట్ చేసుకుని కూడా హైలైట్ అవ్వాలని చూసారు. కానీ వారు ఎంపిక కాలేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఆ ముగ్గురూ ఆకర్షణగా
బిగ్ బాస్ 2 లో విన్నర్ గా ఎవరు నిలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ప్రస్తుతం బిగ్ బోస్ లో ప్రధానంగా ముగ్గురు ఆకర్షణగా నిలుస్తున్నారని తమ్మారెడ్డి పరోక్షంగా గీతా మాధురి, బాబు గోగినేని, తేజస్వి లని ఉద్దేశించి ప్రస్తావించారు.

విన్నర్ ఎవరంటే
ఈ బిగ్ బాస్ లో గీతా మాధురి, బాబు గోగినేని, తేజస్వి లలో ఒకరే విన్నర్ గా నిలుస్తారని తమ్మారెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. బాబు గోగినేని లాజిక్ లు బాగా మాట్లాడతారు. గీతా మాధురి పాటలు బాగా పడుతుంది.. ఇక తేజస్వి యాక్టింగ్ బాగా చేస్తోందని పరోక్షంగా తమ్మారెడ్డి అన్నారు.


Click it and Unblock the Notifications











