twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఆమె చేతుల్లోకి వెళుతుంది.. అందుకే ఆపేస్తున్నారు.. తమ్మారెడ్డి సంచలనం!

    |

    ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తరచుగా తన యూట్యూబ్ ఛానల్ లో తాజా సినీ రాజకీయ అంశాలపై తన విశ్లేషణ అందిస్తుంటారు. తమ్మారెడ్డి ఎలాంటి వివాదం లేకుండా తనదైన శైలిలో రాజకీయాలపై కామెంట్స్ చేస్తుంటారు. కానీ తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యేలా ఉన్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఎన్టీఆర్ కు భారతరత్న మాత్రం రావడం లేదు. దీనికి కారణం చంద్రబాబే అన్నట్లుగా తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

     రిపబ్లిక్ డే సందర్భంగా

    రిపబ్లిక్ డే సందర్భంగా

    ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా చాలా మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించారు. కొందరు తెలుగు వాళ్లకు కూడా పద్మ పురస్కారాలు దక్కాయి. మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోమారు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సినీనటుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగువారి ఖ్యాతిని ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తం చేశారు. అలాంటి వ్యక్తికి భారతరత్న తప్పకుండా ఇవ్వాలని తమ్మారెడ్డి అన్నారు.

     నాకు వచ్చిన అనుమానం ఇదే

    నాకు వచ్చిన అనుమానం ఇదే

    ఇటీవల చంద్రబాబు చేసిన ఓ కామెంట్ గురించి తమ్మారెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు అని ఓ వార్త చూశా. ఇక్కడనే కాకు ఓ అనుమానం వస్తోంది. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ప్రధానిగా అవకాశం వచ్చినా వదులుకునాన్ని అన్నారు. మొన్నటివరకు చంద్రబాబుకు ఎన్డీయేలో భాగస్వామిగానే ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ కు భారరత్న వచ్చేలా చేయడం పెద్ద విషయం కాదు. కానీ చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు లేరని నాకు అనుమానం కలుగుతోంది అంటూ తమ్మారెడ్డి అన్నారు.

    ఆమె చేతుల్లోకి వెళుతుంది

    ఆమె చేతుల్లోకి వెళుతుంది

    ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో ఎలాంటి ప్రయత్నం చేయకుండా అవార్డులు ప్రకటించిన రోజున ఓ స్టేట్మెంట్ పడేస్తారు. చంద్రబాబు ఎన్టీఆర్ భారతరత్న కోసం ప్రయత్నించకపోవడానికి కారణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే ఆ కార్యక్రమానికి ఫ్యామిలీ మొత్తం వెళ్లాలి. ఎన్టీఆర్ సతీమణిగా లక్ష్మీపార్వతి ఆ అవార్డు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీపార్వతి అవార్డు తీసుకోవడం వీళ్ళందరికీ ఇష్టం లేదు. అందుకే చంద్రబాబే ఎన్టీఆర్ భారతరత్నని అడ్డుకుంటున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని తమ్మారెడ్డి అన్నారు.

    ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత

    ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత

    ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం ఇష్టం లేకుంటే ప్రతి సారి ఇలాంటి రొటీన్ డైలాగులు ఆపేయండి. ఇది ఎన్టీఆర్ ని అగౌరవ పరచడమే అవుతుందని తమ్మారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ వచ్చిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఆయన గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించారు. ఎన్టీఆర్ తన ద్వారా సినిమా రంగంలో విప్లవం తీసుకొచ్చారని తమ్మారెడ్డి అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి దేశంలోనే బలమైన సీఎంగా ఎదిగారని ప్రశంసించారు. అలాంటి ఎన్టీఆర్ కి గౌరవం ఇవ్వాలి. కానీ ఇటీవల చాలా మంది ఇష్టం వచ్చిన ఆయన గురించి మాట్లాడుతున్నారని తెలిపారు.

    English summary
    That's why NO Bharat Ratna for NTR. Tammareddy Reveals Few Facts of AP CM Chandrababu Naidu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X