సినిమా వాళ్ళని అనుభవించాలని, ఛీప్ పబ్లిసిటీ కోసం..బిగ్ బాస్ గురించి, తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
Recommended Video

సమకాలీన సినీ రాజకీయ అంశాలపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ ఛానల్స్ వేదికగా సినిమా సెలెబ్రిటీలపై నీచమైన ఆరోపణలు చేసే వారిని ఉద్దేశించి తాజగా తమ్మారెడ్డి స్పందించారు. ఇటీవల మీడియాలో బాగా పాపులర్ అయి ఇప్పటికి చీప్ పబ్లిసిటి కోసం ప్రయత్నిస్తున్న వారిని ఉద్దేశించి తమ్మారెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాళ్ళని అనుభవించాలని
సినిమావాళ్లని చాలా మంది అనుభవించాలని అనుకుంటారు. అబ్బాయిలు హీరోయిన్లని, అమ్మాయిలు హీరోలని కలల్లో ఊహించుకుంటారు. కానీ ఇలాంటి విషయాలు ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు అని తమ్మారెడ్డి అన్నారు.

చీప్ పబ్లిసిటీ కోసం
కానీ కొందరి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో నీచమైన కామెంట్స్ చేస్తూ చీప్ పబ్లిసిటీ పొందుతున్నారని తమ్మారెడ్డి విమర్శించారు. కానీ తమకు ఆ హీరోయిన్ తో సంబంధం ఉంది, ఆ హీరోతో సంబంధం ఉంది అని కెమెంట్స్ చేస్తూ మరీ దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని తమ్మారెడ్డి విమర్శించారు.

ఒరిగేది ఏమి లేదు
ఇలాంటి వారికీ పబ్లిసిటీ కల్పించడం వలన సదరు మీడియాకు, యూట్యూబ్ ఛానల్స్ కు ఒరిగేది ఏమి లేదని, ఇలాంటి చర్యల వలన పరపతి పెరగకపోగా మీరు కూడా పబ్లిక్ లో చులకన అయిపోతారని తమ్మారెడ్డి హెచ్చరించారు.

ఆధారాలు ఏవి
ఇష్టం వచ్చినట్లు పలానా హీరోతో సంబంధం ఉంది, పలానా హీరోయిన్ తో లింకులు ఉన్నాయి అని మాట్లాడితే కుదరదని తమ్మారెడ్డి తెలిపారు. అలాంటిది ఏమైనా ఉంటె సాక్ష్యాలు, ఆధారాలతో ముందుకు రావాలని కోరారు.

కుటుంబాలు ఏమవుతాయి
ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారి కుటుంబాల ఏమవుతాయో ఆలోచించారా.. ప్రతి వ్యక్తిని భాదపెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

బిగ్ బాస్ విషయంలో కూడా
బిగ్ బాస్ విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. తప్పు చేస్తేనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అని ప్రచారం చేస్తున్నారు. అలా అయితే తప్పు చేసిన వారందరిని బిగ్ బాస్ లోకి తీసేసుకుంటారా ని తమ్మారెడ్డి ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











