తమన్నాను వేధిస్తున్న హీరోల పెళ్లాలు!

By Bojja Kumar

మిల్కీ బేబీ తమన్నా గత కొన్ని రోజులుగా మెంటల్ టార్చర్ అనుభవిస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. అల్లు అర్జున్ తో కలిసి బద్రీనాథ్ సినిమాలో నటిండం మొదలు, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి చిత్రంలో నటించిన సమయంలోనూ, తాజాగా రామ్ చరణ్ 'రచ్చ" సినిమా చేస్తున్న సమయంలోనూ తమన్నా మనో వేధన తప్పడం లేదట. తమన్నా ఇంతలా బాధ పడటానికి కారణం ఆయా సినిమాల హీరోలో..ఇంకెవరో కాదు. తన నటించే సినిమాల్లో హీరోల పెళ్లాలేనట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు తమన్నా సన్నిహితులు.

బద్రీనాథ్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే స్నేహారెడ్డితో అల్లు అర్జున్ ఎంగేజ్ మెంట్, పెళ్లి జరిగింది. బద్రీనాథ్ సినిమాలో తన మొగుడుతో కలిసి తమన్నా రొమాన్స్ చేయడం అస్పలు తట్టుకోలేక పోయిన స్నేహ తమన్నాను ఓ రకమైన చూపులో చాలా ఇబ్బంది పెట్టేదట. ఆ చూపులతోనే కొట్టినంత పని చేసేదట. దీంతో చాలా అప్ సెట్ అయిన తమన్నాకు ఆ రోజంతా మనసులో అశాంతిగా ఉండేదట. ఊసరవెల్లి సినిమాలో సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతితోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొందని అంటున్నారు. తాజాగా రామ్ చరణ్ తో రచ్చ చేస్తున్న సందర్భంగానూ సేమ్ సంఘటనలు రిపీట్ అవున్నాయని, రామ్ చరణ్ కు కాబోయే భార్య ఉపాసన నుంచి తమన్నాకు మెంటల్ టార్చర్ తప్పడం లేదని ఫిల్మ్ నగర్ గుసగుస.

ఈ విషయమై ఇప్పటికి బుద్ది తెచ్చుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఇకపై కొత్తగా పెళ్లయిన హీరోలతో, ఎంగేజ్ మెంట్..పెళ్లికి సిద్దమైన హీరోలతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందట. తోటి ఆడవారి నుంచి అలాంటి వేధింపులు ఎదుర్కొంటూ సంపాదించడం కంటే మిన్నకుండటమే మంచిదని తమన్నా భావిస్తోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X