'ఆగడు' లో మరో కామెడీ హైలెట్
హైదరాబాద్ : మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రం గురించి రోజుకో విషయం రివిల్ అవుతూ అభిమానులను ఆనందపరుస్తోంది. తాజాగా ఈ చిత్రంలో తణికెళ్ల భరిణి గురించి బయిటకు వచ్చింది. తమన్నా తండ్రిగా ఈ పాత్ర ఉంటుందని, భరిణిగారు ఇప్పటివరకూ కనపడని,ఢిఫెరెంట్ పాత్రలో కామెడీ విలన్ గా కనపడతారని చెప్తున్నారు. ఆయనతో హీరో,హీరోయిన్స్ కామెడీ సీన్స్ బాగా వచ్చాయంటున్నారు. సినిమా విడుదల అయ్యాక చెప్పుకునే హైలెట్స్ లో భరిణిది కూడా ఒకటి ఉండబోతోందన్నమాట. తమన్నా హీరోయిన్ . 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది. ఈ డైలాగులతో సినిమాకు విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయ్యింది. మీడియాలో ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ జరిగింది. ఎవరిని ఉద్దేశించి మహేష్ ఈ సెటైర్స్ వేసాడంటూ మాట్లాడుకున్నారు. ఇలా మాట్లాడుకోవటానికే ఈ డైలాగులు వదిలారని, నిజానికి సినిమాలో ఈ డైలాగులు లేవని అంటున్నారు. అయితే ఉన్నాయా లేవా అనేది రిలిజ్ అయితేకానీ తెలియదు.

సెప్టెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్ కెరీర్‌లో నెంబర్ వన్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. మహేష్ పలికే ప్రతి సంభాషణ ఆకట్టుకొంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అందరికీ నచ్చుతుంది''అని చిత్రబృందం చెబుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











