ఉమ్మడి కుటుంబంలో...('చాణక్యుడు' ప్రివ్యూ)
చాణక్యుడు (తనీష్) ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతల మధ్య పెరుగుతాడు. అనాథ యువతి స్వప్న (ఇషితా దత్తా) అతన్ని ఇష్టపడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనే సమయంలో చాణక్యుడి కుటుంబానికి కొందరు అపాయం తలపెడతారు. వారి నుంచి తన కుటుంబాన్ని అతను ఎలా రక్షించుకున్నాడనేది మిగిలిన కథ.
నిర్మాతలు మాట్లాడుతూ ''కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. పోరాట దృశ్యాలు ప్రధాన ఆకర్షణ. చక్కటి వినోదం ఉంటుంది''అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచికథే ఈ చిత్రానికి ఆయువుపట్టు అని చెప్పగా, నటించడానికి అవకాశం ఉన్న పాత్ర తనకు లభించిందని ఇషితాదత్తా పేర్కొన్నారు.
సంస్థ: సాయి శ్రీనివాస ప్రొడక్షన్స్.
నటీనటులు: తనీష్, ఇషితా దత్తా, చంద్రమోహన్, సలీమ్‌పండా, శ్రవణ్, బాలయ్య, రమేష్ తదితరులు.
మాటలు: చింతా శ్రీనివాస్,
పాటలు: కందికొండ, వెంగళ్‌దాస్,
ఛాయాగ్రహణం: ఇ.ఎస్.హెచ్. ప్రసాద్,
సంగీతం: రాహుల్-వెంగి,
ఎడిటింగ్: నందమూరి హరి,
ఆర్ట్: భాస్కర్,
ఫైట్స్: వెంకట్,
నిర్మాతలు: తిరివీధి సంతోష్, గొట్టిగింటి రామచంద్ర, నందన్‌రెడ్డి కొలన్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గొట్టిగింటి శ్రీనివాస్.
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications












