గాంధీ దర్శకత్వంలో తనీష్
చందన్ మూవీస్ పతాకంపై శివాజీ హీరోగా 'గురుడు', 'ఆశ దోశ అప్పడం' చిత్రాలను నిర్మిస్తున్న యువ నిర్మాత సి.డి.నాగేంద్ర తాజాగా తనీష్‌తో మరో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. చందన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.3గా రూపొందనున్న ఈ చిత్రానికి వి.సాయికిషోర్ రెడ్డి నిర్మాణ సారథ్యం వహిస్తుండగా.. పోలంరెడ్డి గుణశేఖర్ రెడ్డితో కలిసి సి.డి.నాగేంద్ర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.
చందన్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రొపొందిన 'గురుడు' ఆడియో విడుదల సహా.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇదే బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మాణమవుతున్న 'ఆశ దోశ అప్పడం' షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ఆడియో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది.
'ఆశ దోశ అప్పడం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గాంధీ మనోహర్ ఈ మూడో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఉగాది పర్వదినాన ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ఎస్.మురళీమోహన్ రెడ్డి, సంగీతం:రఘురామ్, నిర్మాణ సారథ్యం:వి.సాయికిషోర్‌రెడ్డి, నిర్మాతలు:పోలంరెడ్డి గుణశేఖర్‌రెడ్డి - సి.డి.నాగేంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గాంధీ మనోహర్!


Click it and Unblock the Notifications












