twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమర్షియల్ హిట్ అవదని ముందే తెలుసు: తనికెళ్ల భరణి

    By Srikanya
    |

    Tanikella Bharani
    హైదరాబాద్ : మిధునం చిత్రం కమర్షియల్‌గా అది విజయం సాధించదని ముందుగానే తెలుసు. అయితే ఏ చిత్ర నిర్మాణానికైనా నిర్మాత ప్రాణం. అటువంటి అభిరుచి గల ఆనందరావు నాకు నిర్మాతగా దొరకటంతో ఈ చిత్రాన్ని చేయగలిగాను. అలాగే నష్టం లేకుండా చిత్రంపై పెట్టిన డబ్బుని తెస్తే చాలనుకున్నాం. ఆ విధంగా ఆచిత్రం 50 రోజుల పాటు థియేటర్లలో ఆడి మమ్మల్ని గెలిపించింది అంటున్నారు తణికెళ్ల భరణి.

    మిధునం తనికెళ్ల భరణి పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా మాటల రచయితగా, ఒకమంచి నటుడు గాను గుర్తుకు వస్తారు. అయితే ఇటీవల కాలంలో ఆయనను ఒక మంచి దర్శకుడి గాను గుర్తించగలుగుతున్నాం. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న తరుణంలో మిధునం పేరుతో అచ్చతెలుగు సంప్రదాయ చిత్రం నిర్మించి దర్శకుడిగా విజయం సాధించారు. హాస్యనటుడు ఆలీ సత్కార కార్యక్రమానికి వచ్చిన భరణి మిధునం చిత్ర విశేషాలను, ఆ చిత్ర విజయాన్ని మీడియాతో పంచుకున్నారు.

    అలాగే మిధునం నవలను చిత్రంగా తీయాలని అనిపించటానకి కారణం చెప్తూ... శ్రీరమణ రచించిన మిధునం నాకు బాగా నచ్చిన నవల. అందులో కుటుంబ బాంధవ్యాలను అద్భుతంగా రాశారు. అయితేదర్శకత్వం వహించాలని భావించినపుడు అంతరించిపోతున్న కుటుంబ బంధాలను చూపించాలనే ఉద్దేశంతో మిధునం కథను ఎంచుకున్నాను అన్నారు.

    ఇక తణికెళ్ళ మంచి నటుడుగా నిరూపించుకున్నారు. బాలసుబ్రహ్మణ్యాన్ని ఆ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ... కేవలం రెండు పాత్రల నడుమ జరిగే సంభాషణలే ప్రధానాంశంగా నిర్మించిన ఈ చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం సరైన వారని భావించాను. అలాగే దర్శకత్వం, నటన రెండూ చేయటం సాధ్యం కాదని నేను నటించలేకపోయాను అన్నారు.

    మిధునం తెచ్చిన అవార్డులు గురించి చెప్తూ... మిధునం చక్కని కుటుంబ బాంధవ్య చిత్రంగా మంచి ఆదరణ పొందింది. అలాగే అవార్డులను తెచ్చిపెట్టింది. వంశీ ఆర్ట్స్‌, చెన్నైకు చెందిన ప్రతిష్టాత్మక రాగసుధ సంస్థ అవార్డు, తానా సభలో ప్రత్యేకించి మిధునం యూనిట్‌ అంతటికి సన్మానం చేయటం మరచిపోలేను. వచ్చే సంవత్సరం మరొకచిత్రం తీయాలని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

    ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆనంద్‌ ముయిదా రావు నిర్మాత. శ్రీకాకుళం జిల్లా వావిలవలస గ్రామంలో సన్నివేశాల్ని తెరకెక్కించారు. 'మిథునం' చిత్రానికి వీణాపాణి స్వరాలు సమకూర్చారు. ఇక గతంలో భరిణి 'సిరా', 'కీ', 'బ్లూ క్రాస్‌' లాంటి లఘు చిత్రాలు రూపొందించి పురస్కారాలు అందుకొన్నారు. 'మిథునం' పూర్తిస్థాయి చలనచిత్రం. ఈ చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించారు.

    English summary
    Tanikella Bharani latest movie Midhunam starring Balasubramanyam and Lakshmi in lead. Midhunam turns out a cool flick last Year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X