twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటప్పుడు తెలుగువాళ్ళం అని చెప్పుకోకండి: తనికెళ్ల భరణి

    పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి!

    |

    పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి! కనీసం, ఆ పద్యాలను ముట్టుకోండి, పుణ్యం వస్తుందని నా ఉద్దేశం అంటూ అభిప్రాయ పడ్డారు తనికెళ్ళ భరణి

    ఆక్సిజన్ లేకపోయినా బతకగలనేమో గానీ, పుస్తకాలు లేకపోతే మాత్రం బతకలేనేమోనని అనిపిస్తుంటుందని ప్రముఖ నటుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి అన్నారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, 'పుస్తకం మంచి స్నేహితుడు అనే నానుడి ఉంది.

    Tanikella Bharani about Telugu

    పది పుస్తకాలు పడేసి గడిపెయ్యమంటే గడిపేస్తాను. ఆ స్థితిని దయచేసి, యువత డెవలప్ చేసుకోవాలి. పూర్వం మన ఇళ్లల్లో భారత, భాగవతాలు చదువుతుండేవారు .. వింటుండేవారు.టైంపాస్ కోసం, భక్తి కోసం, జీవన విధానం కోసం ... కావ్యాలు చదివేవారు. పూర్వం .. కనీసం 10 నుంచి 100 పద్యాలు రాని తెలుగు ఇల్లు ఉండేది కాదు.

    పోతన భాగవతం .. ద్రాక్షపాకం. ఆ పద్యాలు చదువుతుంటే తనివి తీరదు. పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి! కనీసం, ఆ పద్యాలను ముట్టుకోండి, పుణ్యం వస్తుందని నా ఉద్దేశం. పోతన భాగవతం .. ఆధ్యాత్మికం, రసాత్మకం. ఈ రెండింటీకి ఉపయోగపడుతుంది. పోతన భాగవతం చదివితే దైవం సాక్షాత్కారం అయిపోతుంది' అని భరణి అభిప్రాయపడ్డారు.

    English summary
    Actor Tanikella Bharani posted a viedeo on his Twitter about telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X