twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడు లేడన్న వారిపై తనికెళ్ల భరణి కాంట్రవర్సీ కవిత.. వివాదం ఎక్కువవ్వడంతో క్షమాపణలు

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సహా నటుడిగా ఎన్నో పాత్రల్లో మెప్పించిన తనికెళ్ళ భరణి గురించి అందరికి తెలిసిందే. ఆయన శివ భక్తుడని కూడా అందరికి తెలిసిన విషయమే. కొన్ని సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన భరణి సాహితీ ప్రియుడిగా, రచయితగా, కవిగా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే ఇటీవల ఆయన కవిత ఒకటి వివాదస్పదంగా మారడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు.

    Recommended Video

    Tanikella Bharani Controversial Poem, వ్యతిరేకత రావడంతో డిలీట్!!
    దైవత్వం ఉండేలా..

    దైవత్వం ఉండేలా..

    తనికెళ్ల భరణి కవిత అనగానే అందరికి 'శబ్బాష్ రా' అనే కవితలే గుర్తుకు వస్తాయి. అప్పట్లో నాన్న ఎందుకో వెనుకబడిపోయాడు అనే కవిత సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. ప్రశ్నించేలా ఉంటూనే ఎంతో దైవత్వం దాగి ఉండేలా కవితలు రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

    హేతువాదులకు కౌంటర్ పడేలా..

    హేతువాదులకు కౌంటర్ పడేలా..

    నిత్యం శివ నామ స్మరణలో ఉండే తనికెళ్ల భరణి ఇటీవల హేతువాదులకు కౌంటర్ పడేలా ఒక కవితను రాయడం కాంట్రవర్సీకి దారి తీసింది. వివాదం మరింత ముదరక ముందే ఆయన ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్ గా క్షమాపణ కోరడం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది.

     తనికెళ్ల భరణి కవిత

    తనికెళ్ల భరణి కవిత


    ఇంతకు తనికెళ్ల భరణి రాసిన కవిత ఏమిటంటే..
    "గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు
    నువ్వుండగ లేవంటరు!
    నువ్వున్నవో లేవో చెవుల జెప్పిపోరా
    శబ్బాష్ రా శంకరా"
    అనే ఈ కవిత ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కవిత హేతువాదులకు ఆగ్రహం తెప్పించడంతో మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

    క్షమాపణ కోరిన భరణి

    క్షమాపణ కోరిన భరణి


    దేవుడు లేడు అని చెప్పే హేతువాదులను గాడిదలతో పోల్చినట్లు ఉందని బాబు గోగినేని వంటి ప్రముఖులు భరణి కవితపై మండిపడ్డారు. దీంతో మరుక్షణమే స్పందించిన ఈ సీనియర్ నటుడు క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. ఏదైనా వివరణ ఇస్తే సర్దిచెప్పుకుంటున్నట్లు ఉంటుందని అందుకే బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను అని చేతులెత్తి మొక్కరు. హేతువాదులన్నా, మానవతా వాదులన్నా కూడా తనకి గౌరవమే అంటూ వ్యతిరేకత ఎంతమాత్రం లేదని కవితను డిలీట్ చేస్తున్నట్లు చెప్పారు.

    English summary
    Everyone knows about Tanikala Bharani who has impressed in many roles as an actor including in the Tollywood film industry. It is a well known fact that he is a devotee of Lord Shiva. Bharani, who has worked as a writer for some films, has also received numerous awards as a literary lover, writer and poet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X