సైరా టాక్.. అసలు విషయం చెప్పేసిన యాక్టర్

మెగాస్టార్ కెరీర్ లోనే ప్రెస్టీజియస్ సినిమాగా రూపొందుతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి. ఇప్పటి వరకూ ఈ కథ విషయంలో ఎలాంటి అప్‌డేట్ బయటకు రాకపోవడం కారణంగా తనికెళ్ళ భరణి మాటలు మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేశాయి.

ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ళ భరణి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి సైరా టాపిక్ తీశారు. సరికొత్త చరిత్రను సృష్టించేలా సైరా నరసింహా రెడ్డి సినిమా తెరకెక్కుతోందని, ఈ సినిమా మెగా అభిమానుల అంచనాలను మించి ఉంటుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. బాహుబలి సినిమాతో పెరిగిన తెలుగు సినిమా ఖ్యాతిని సైరా మరింతగా పెంచేస్తుందని భరణి అభిప్రాయ పడ్డారు.

Tanikella Bharani Comments on Sy Raa Narasimhaa Reddy

ఇక సైరా సినిమాలో తన పాత్ర కొత్త తరహాలో ఉంటుందని ఆయన తెలిపారు. సినిమా ఆలస్యం అవుతోందని చింతించవద్దని, ఊహించిన దానికి మించిన సన్నివేశాలు ఈ సినిమాలో చూడొచ్చని అన్నారు భరణి. కష్టానికి తగిన ప్రతిఫలం సైరా యూనిట్ కి తప్పకుండా దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ సైరా లో అవకాశం రావడం తన అదృష్టమని తనికెళ్ళ భరణి పేర్కొనడం గమనార్హం.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్ తో సైరా నరసింహా రెడ్డి సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలు నడుమ ఈ సినిమా అక్టోబర్ 2 తేదీన విడుదల కానుంది. మెగాస్టార్ 151 వ సినిమాగా వస్తున్న సైరా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X