తణికెళ్ల భరణి దర్శకత్వంలో సినిమా ప్రారంభం
ప్రముఖ రచయిత, నటుడు తణికెళ్ల భరిణి ఓ ఫీచర్ ఫిల్మ్ ని డైరక్ట్ చేస్తూ పూర్తి స్ధాయి దర్సకత్వంలోకి దిగుతున్నారు. ఆ చిత్రం పేరు 'మిథునం'. శ్రీరమణ రాసిన కథ ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వావిలవలస గ్రామంలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 'మిథునం' చిత్రానికి వీణాపాణి స్వరాలు సమకూరుస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇక గతంలో భరిణి 'సిరా', 'కీ', 'బ్లూ క్రాస్' లాంటి లఘు చిత్రాలు రూపొందించి పురస్కారాలు అందుకొన్నారు.
'మిథునం' పూర్తిస్థాయి చలనచిత్రం. ఈ చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యంని కీ రోల్ కి తీసుకున్నారు కాబట్టి పాటలకు కూడా ప్రాధాన్యత ఉండేలా చేస్తారేమో చూడాలి. రీసెంట్ గా ఎస్పీ బాలసుబ్రమణ్యం..దేవస్దానం అనే చిత్రంలో సైతం చేసారు. జనార్ధన మహర్షి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











