twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారి తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమా ప్రారంభంలో కథ,కథనాలను పరిచయం చేస్తూ ఎవరో ఒకరు స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లు వాయిస్ ఓవర్ చెప్పటం తెలుగు సినిమాలలో ఈ మధ్యన చాలా కామన్ అయ్యింది. ఆ వాయిస్ ఓవర్ ని మహేష్,పవన్,సునీల్,రవితేజ వంటి స్టార్ హీరోలు లేదా పూరీ జగన్నాథ్, వివి వినాయిక్ వంటి స్టార్ డైరక్టర్స్ చెప్తూ వస్తున్నారు. తాజాగా రచయిత,నటుడు, దర్శకుడు అయిన తణికెళ్ల భరణి వంతు వచ్చింది. 'పంచమి' చిత్రం కోసం ఆయన తన గాత్రాన్ని దానం చేశారు. 'పంచమి' అర్చన నటించిన చిత్రమిది. సుజాత భౌర్య దర్శకత్వం వహిస్తున్నారు.

    అర్చన ముఖ్యపాత్ర పోషిస్తున్న చిత్రం పంచమి. మేఘన అండ్‌ హర్ష సమర్పణలో ఐడియా మూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత డి.శ్రీకాంత్‌ నిర్మిస్తున్నారు. సుజాత భౌర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీకోటి సంగీతం అందించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు సుజాత భౌర్య విలేకరులతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...''చిన్నతనం నుంచి ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. రొటీన్‌గా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనే తపన నాలో ఉండేది. అందుకే ప్రయోగాత్మకంగా సింగిల్‌ క్యారెక్టర్‌తో పంచమి సినిమా చేశా. లవ్‌ స్టోరీలు, యాక్షన్‌ సినిమాలు అందరూ చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఈ సినిమా చేశా.

    Tanikella Bharani

    రచయితగా దాసరి గంగాధర్‌ని కలిసి నా ఆలోచనల్ని ఆయనతో పంచుకుని కథను రెడీ చేశాం. సీన్‌ బై సీన్‌ రాసేకొద్ది చాలా ఆసక్తిగా కథ రెడీ అయింది. ఒక ఫొటోగ్రాఫర్‌ తన దగ్గరున్న ఫొటో కలెక్షన్‌ని ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి గోల్డ్‌ మెడల్‌ సాధించాలనుకుంటుంది. దానిలో భాగంగా ఫొటో షూట్‌ కోసం ఓ అడవికి వెళుతుంది. అక్కడ ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. తనకి ఎదురైనా అనుభవాలేంటి అనేది కథ. దాంతోపాటు మరణం లేకుండా జీవించగలమా? లేదా? అని ఆమె మదిలో తొలిచిన ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రం. స్టార్‌ హీరోయిన్‌తో సినిమా తీసేంత అనుభవం నాకులేదు. ఈ కథకి అర్చన అయితే న్యాయం చేయగలదనిపించింది. ఆమెలో టాలెంట్‌ ఉంది. అందుకే ఆర్చనని ఎంపిక చేశాం. తన పాత్రకి వందశాతం న్యాయం చేసింది. కొన్ని సీన్స్‌ని డూప్‌ లేకుండా చేసి మెప్పించింది. ఈ చిత్రంతో ఆమెకు మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో 52 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి.

    రాజేష్‌ పాల అద్భుతంగా గ్రాఫిక్స్‌ చేశారు. సింగిల్‌ క్యారెక్టర్‌ అనే ఫీలింగ్‌ ఎక్కడా కలగదు. పాటలకు రెస్పాన్స్‌ బాగుంది. నిర్మాత ఖర్చుకి వెనకాడకుండా తీశారు. శ్రీకోటి చక్కటి సంగీతం అందించారు. నా నెక్ట్‌‌స మూవీ ఓ ప్రముఖ హీరోతోనే ఉంటుంది. ఓ క్యూట్‌ లవ్‌స్టోరీని ప్లాన్‌ చేస్తున్నాం. కథ రెడీగా ఉంది. వచ్చే నెలలో సినిమా ప్రారంభమవుతుంది. నేను హైదరాబాద్‌ అమ్మాయినే. చెనై్నలో డిఎఫ్‌టి పూర్తి చేశా. తరువాత గీతాకృష్ణ వద్ద యాడ్‌ ఏజెన్సీలో పనిచేశా. కృష్ణవంశీ వద్ద చక్రం సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. సొంత యాడ్‌ ఏజెన్సీ కూడా ఉంది'' అన్నారు.డి.శ్రీకాంత్‌ నిర్మాత. ఒకే ఒక్క పాత్రతో ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. ఈ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    English summary
    Director, Writer and artist Tanikella Bharani is now lending his vocals to the Archana starrer Panchami film. Impressed with the story and screenplay designed by the director, Bharani instantly agreed to give his voice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X