తనికెళ్ల భరణి పెళ్లైన కొత్తలో ఇలా... (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినీ అభిమానులకు నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సోషల్ నెట్వర్కింగులో యాక్టివ్‌గా ఉన్న ఆయన తాజాగా తన పెళ్లైన కొత్తలో ఫోటో ఒకటి షేర్ చేసారు. ఈ ఫోటోకు మంచి స్పందన వస్తోంది. నిమిషాల్లోనే వేలాది లైక్స్ వచ్చి పడ్డాయి.

తనికెళ్ల భరణి ప్యాసా గురించి...
సినీనటుడు, దర్శకుడు, రచయిత కూడా అయిన తనికెళ్ల భరణి రాసిన ఓ పుస్తకం ‘ప్యాసా' పేరిట ఓ పుస్తకం రచించారు. ఇప్పుడా పుస్తకం ఖండాంతరాలకేగి, బ్రిటీష్ పార్లమెంటులో ఆవిష్కరణ జరుపుకుంది. ఓ తెలుగు పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో విడుదల కావడం తొలిసారి.

Tanikella Bharani young photo

దీనిపై తనికెళ్ళ భరణి స్పందిస్తూ, తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కాగా, ప్యాసాను బ్రిటీష్ పార్లమెంటు వరకు తీసుకెళ్ళడంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగమ్మాయి ప్రశాంతి రెడ్డిని వివాహమాడి తెలుగింటి అల్లుడైన బ్రిటీష్ ఎంపీ డాన్ బైల్స్ కూడా ఈ విషయంలో సహకరించారట. బ్రిటన్ లోని తెలుగు సంఘం సభ్యులు కూడా భరణి పుస్తకావిష్కరణ అంశంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఉమర్ ఖయ్యాం- ‘ రుబాయత్ ' పుస్తకం స్ఫూర్తిగా తనికెళ్ల భరణి ప్యాసాను రచించారు. ఈ గ్రంథం ఆస్ర్టేలియాతోబాటు వివిధ దేశాల్లోకూడా విడుదలైంది. ఈ పుస్తకం వెల రూ. 100.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X