నా కొడుకు నన్ను ఓడిస్తాడు...తణికెళ్ళ భరణి

By Srikanya

కుమారుని చేతిలో ఓడిపోవడం ఓ వరం. నటనలో నా కుమారుడు నన్ను ఓడించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు తణికెళ్ళ భరణి.క్యారెక్టర్ ఆర్టిస్టు, రచయిత తనికెళ్ళ భరణి కుమారుడు తేజ తనికెళ్ల హీరో అయ్యారు.ఆర్.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చలపతి మల్లాది దర్శకత్వంలో ఎ.కె.సాయికుమార్ నిర్మిస్తున్న 'మిస్టర్ లవంగం' చిత్రం ఆడియో సీడీలను హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్ మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా సింధు పరిచయమవుతోంది.బ్రహ్మానందం, క్రిష్ణ భగవాన్, చలపతిరావు, సుమన్‌శెట్టి, మెల్కోటి, రంగనాథ్, కొండవలస, గౌతంరాజు, ఛత్రపతి శేఖర్, పృథ్వీ, ధన్‌రాజ్, రాజేంద్ర, ఇంటూరి వాసు, పూర్ణిమ, పావల శ్యామల, ఉమ, అను,సంధ్య, మధుర, వనిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె.రిషాల్ సాయి, కో-ప్రొడ్యూసర్:జి.కె.కిశోర్, ఫొటోగ్రఫీ: టి.రాజేంద్ర, ఎడిటర్: నందమూరి హరి: రచన, దర్శకత్వం: చలపతి మల్లాది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X