అతను సొంత తమ్ముడు కాదు.. రైల్వే స్టేషన్‌లో దొరికాడంటూ తనీష్ షాకింగ్ పోస్ట్!!
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వెండితెరపై హీరోగా ఎదిగాడు తనీష్. అయితే నచ్చావులే, మేం వయసుకు వచ్చాం వంటి మంచి చిత్రాలతో బాగానే గుర్తింపును తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎంత గుర్తింపును తెచ్చుకున్నాడో అంతకు వంద రెట్ల క్రేజ్‌ను బిగ్ బాస్ షో ద్వారా తెచ్చుకున్నాడు. నిజాయితీ, ముక్కుసూటిదనం, నమ్మిన వారి కోసం నిలబడటం వంటి పాజిటివ్ లక్షణాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే మీతిమీరిన కోపం వల్ల తనీష్‌పై కొంత నెగెటివిటీ పెరిగింది.

షోలో హైలెట్..
బిగ్‌బాస్ రెండో సీజన్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంటెస్టెంట్లలో తనీష్ ఒకడు. ఫైనల్ విజేతల్లో టాప్ 3గా నిలబడి లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దీప్తి సునయన, సామ్రాట్, తేజస్వీలతో ఎక్కువగా ఉన్న తనీష్ మధ్యలో అందరితో కలిసి ప్రయత్నం చేశాడు. ఇక కౌశల్‌తో గొడవలు మాత్రం యథావిథిగా జరిగేవి.. మళ్లీ కలుసుకునేవారు.

పర్సనల్ విషయాలు..
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తనీష్ తన వ్యక్తిగత విషయాల గురించి దీప్తి సునయనతో ఎక్కువగా చెప్పేవాడు. బయటి లోకం అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, షూటింగ్, స్కూల్ తప్ప ఇంకో విషయం కూడా తెలియకపోయేదని, నాన్న చనిపోయిక పరిస్థితులన్నీ మారిపోయానని చెప్పుకొచ్చాడు. కనీసం బ్యాంకులో డబ్బులు ఎలా వేయాలి, ఎలా తీయాలో కూడా తెలియదని చెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయి.

అమ్మ అంటే ఇష్టం..
తనీష్‌కు వాళ్ల అమ్మ అంటే ఎంత ఇష్టమో షోలో ఎన్నో సార్లు వివరించాడు. లావు తగ్గుతానని, కోపం తగ్గించుకుంటానని షోలోకి వచ్చేటప్పుడు మాటిచ్చాను అని అంటూ తనీష్ ఇంటి సభ్యులతో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఇక తన తమ్ముల్లిద్దరి గురించి ఎంతో ప్రేమను కురిపించాడు.

తాజాగా అలా..
తాజాగా తనీష్ సోదరుడైన కృష్ణ అల్లాడి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. తనీష్ అన్న గురించి ఓ సీక్రెట్ చెప్పండి అని సదరు ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు.. అసలు అతను నా అన్నయ్యే కాదు అంటూ కృష్ణ సమాధానం ఇచ్చాడు.
Recommended Video

రైల్వే స్టేషన్‌లో దొరికాడు..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తనీష్ తన తమ్ముడి పోస్ట్‌పై గట్టిగానే కౌంటర్ వేశాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ చెబుతూ.. అవును మాకు వాడు రైల్వే స్టేషన్‌లో దొరికాడు.. పాపం అని ఇంటికి తెచ్చుకున్నాం అంటూ సరదాగా నవ్వేశాడు.మొత్తానికి అన్నాదమ్ముల్లిద్దరూ సెటైర్లు బాగానే వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











