టాలీవుడ్లో మరో ‘దేవదాస్’
అయితే ఈ చిత్రం గతంలో వచ్చిన దేవదాసు చిత్రాల మాదిరి ఉండదని, ఈ తరం యువతకు నచ్చేలా, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా జి. శ్రీనివాస్ అనే దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.
సెప్టెంబర్ 7న తనీష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈచిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. నిర్మాత వి.ఎస్. రామిరెడ్డి ఈచిత్రాన్ని వి.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఈచిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడు. హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు సినిమా ప్రారంభం రోజున వెల్లడి కానున్నాయి.
మరో వైపు తనష్ 'తెలుగబ్బాయి' చిత్రంలో నటిస్తున్నాడు. తనీష్, రమ్య నంబీశన్, తషు కౌశిక్ హీరో హీరోయిన్లుగా ఓఎస్ అవినాష్ దర్శకత్వంలో రూపొందుతోంది. వెరా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మాత ఎస్. రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications












