twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తనీష్ 'అమ్మ.. నేను.. ఆ అమ్మాయి' ప్రారంభం

    By Srikanya
    |

    హైదరాబాద్ : తనీష్‌, స్మితిక జంటగా నటిస్తున్న చిత్రం 'అమ్మ.. నేను.. ఆ అమ్మాయి' ఉగాది సందర్భంగా మొదలైంది. ఏం బాబూ లడ్డూ కావాలా డైరక్టరక్ ...గాంధీ మనోహర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సి.డి.నాగేంద్ర నిర్మాత. హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి యంగ్ హీరో నాని క్లాప్‌నిచ్చారు. సి.కల్యాణ్‌ స్విచ్చాన్‌ చేశారు. పిల్ల జమీందార్ దర్శకుడు అశోక్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

    తనీష్‌ మాట్లాడుతూ ''చాలా సరదాగా సాగే ప్రేమకథ ఇది. కొన్ని మలుపులు ఆసక్తి రేకెత్తిస్తాయి. కుటుంబ బంధాలకూ చోటుంది. సింపుల్ లవ్‌స్టోరీ. ఫ్యామిలీ సెంటిమెంట్స్‌తో సాగుతుంది. స్క్రీన్‌ప్లే ప్రధానమైన చిత్రం''అన్నారు. మంచి సినిమా అవుతుందని స్మితిక చెప్పింది.

    దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''కుటుంబ సమేతంగా చూడాల్సిన ప్రేమ కథా చిత్రమిది. తనీష్‌ నటన తప్పకుండా ఆకట్టుకొంటుంది''అన్నారు. తనీష్‌కి టైలర్ మేడ్ పాత్రని దర్శకుడు తెలిపారు. ఈ నెల 25 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. నాగబాబు, రావు రమేష్‌, షఫీ, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ "తనీష్ కథ వినగానే ఒప్పుకున్నారు. మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. కామెడీ బావుంటుంది. క్యూట్ లవ్‌స్టోరీ ఉంటుంది. ఎనర్జిటిక్ చిత్రమవుతుంది. మా దర్శకుడు 100 రోజుల సినిమా తీస్తాడన్న నమ్మకం ఉంది'' అని తెలిపారు. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న సినిమా అని సంగీత దర్శకుడు రఘురామ్ చెప్పారు.

    నాగబాబు, రావు రమేష్, షఫి, చిత్రం శ్రీను, సంధ్యా జనక్, సురేఖావాణి, విజయ్‌సాయి, శ్రీచరణ్ ముఖ్య తారాగణం. కళ: విజయ్‌కృష్ణ, పోరాటాలు: నందు, కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: రఘురామ్, సాహిత్యం: అనంతశ్రీరామ్, కేదారినాథ్, అలరాజ, నిర్మాణ సారథ్యం: వి.సాయికిషోర్‌రెడ్డి, సమర్పణ: పోలంరెడ్డి గుణశేఖర్‌రెడ్డి.

    English summary
    Chandan Movies is coming up with a new film with Tanish as hero. This production house which earlier delivered films like Shivaji starrer ‘Gurudu’ and ‘Aasa Dosa Appadam’ will now produce this untitled film as Production No. 3. C D Nagendra will produce it along with Polamreddy Gunasekhar Reddy. V Sai Kishore Reddy is the executive producer. Gandhi Manohar wrote the story and screenplay and will direct the film with camera by S Murali Mohan Reddy and music by Raghuram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X