తనీష్ హీరోగా మరో సినిమా
తనీష్ హీరోగా ప్రొడక్షన్ నెం.3గా రూపొందుతున్న చిత్రానికి వి.సాయి కిషోర్ రెడ్డి నిర్మాణ సారథ్యం వహిస్తుండగా, పోలంరెడ్డి గుణశేఖర్ రెడ్డితో కలిసి సి.డి. నాగేంద్రరెడ్డి ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. చందన్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందిన 'గురుడు' ఆడియో విడుదల సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా, ఇదే బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మాణమవుతున్న 'ఆశ దోశ అప్పడం' షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని..త్వరలో ఆడియో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది.
'ఆశ దోశ అప్పడం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గాంధీ మనోహర్ తనీష్ హీరోగా రూపొందబోయే మూడో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఉగాది పర్వదినాన ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్. మురళీ మోహన్, సంగీతం: రఘురామ్, నిర్మాణ సారథ్యం: వి. సాయికిషోర్ రెడ్డి, నిర్మాతలు: పోలంరెడ్డి గుణశేఖర్ రెడ్డి, సిడి నాగేంద్ర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గాంధీ మనోహర్.


Click it and Unblock the Notifications












