బిగ్‌బాస్ తనీష్‌.. రంగు పడటం ఖాయమట..

టాలీవుడ్ హీరో, బిగ్‌బాస్ ఫేం తనీష్, ప్రియా సింగ్ జంటగా నటించిన " రంగు" సినిమా ఇటీవల వివాదంలో చిక్కుకున్నది. విజయవాడ రౌడీ షీటర్, దివంగత లారా జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొన్నది. ఈ నేపథ్యంలో లారా కుటుంబ సభ్యులకు చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన చూసిన వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ఈ సినిమా విషయంలో తనీష్‌కు ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే..

విజయవాడ రౌడీ జీవితం ఆధారంగా

విజయవాడ రౌడీ జీవితం ఆధారంగా

విజయవాడలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ లారా అనే జీవిత కథ ఆధారంగా రంగు సినిమా రూపొందిందింది. లారా కథను సినిమా రిలీజ్ కాబోతోందని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఈ సోమవారం (12.11.11) ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ పెట్టి తమ అభ్యతరాలు చెప్పడం జరిగింది. వాటిపై స్పందించిన చిత్ర యూనిట్ వారికి సినిమాను ప్రసాద్ లాబ్‌లో ప్రత్యేక ప్రదర్శించారు.

నెగిటివ్ ఫీలింగ్‌తోనే

నెగిటివ్ ఫీలింగ్‌తోనే

సినిమా చూసిన అనంతరం లారా కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్ మీడియా తో మాట్లాడుతూ..

దిలీప్ (లారా బావ మరిది) మాట్లాడుతూ.. మీడియా ద్వారా మా అభ్యతరాలు చెప్పిన తర్వాత నిర్మాత, దర్శకులు మమ్మల్ని పిలిపించి మాట్లాడారు. సినిమా మీద నెగిటివ్ ఫీలింగ్‌తోనే వచ్చాము. సినిమా చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

మూడు సీన్లపై అభ్యంతరం

మూడు సీన్లపై అభ్యంతరం

రంగు చిత్రంలో రెండు, మూడు సన్నివేశాల్లో డైలాగ్స్ మ్యూట్ చేయమని కోరాం. అందుకు దర్శకుడు సానుకూలంగా స్పందించాడు. లారా జీవితం కథగా మలిచిన తీరు బాగుంది. తనీష్ నటన బాగుంది. విజయవాడలో ఈ సినిమాకు అండగా నిలబడతాం. మేమే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తాం" అన్నారు.

చెమర్చిన కళ్లతో.. తనీష్

చెమర్చిన కళ్లతో.. తనీష్

హీరో తనీష్ మాట్లాడుతూ.. నేను చెప్పినట్లు రంగు సినిమా రిలీజ్ అవుతుంది. పోస్టర్ పడుతుంది.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చెమర్చిన కళ్ల తో బయటకు వస్తారు. లారా కుటుంబ సభ్యులు సినిమాకు అండగా నిలబడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది " అన్నారు.

రంగు ఎమోషనల్ జర్నీ

రంగు ఎమోషనల్ జర్నీ

దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ.. రంగు ఒక ఎమోషనల్ జర్నీగా ఉంటుంది. లారా కుటుంబ సభ్యులు ఈ సినిమా పై అభ్యంతరాలు వ్యక్త పరిచాక వారికి సినిమా చూపించడం జరిగింది. వారు కోరినట్లు సినిమాలో రెండు మూడు సన్నివేశాల్లో సౌండ్ మ్యుట్ చేస్తాం అని అన్నారు.

ఈ నెల 23న రిలీజ్

ఈ నెల 23న రిలీజ్

నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. సినిమాపై ఉన్న అభ్యతరాలు అన్నీ ఈ రోజు తొలిగిపోయాయి. సినిమా లారా కుటుంబ సభ్యులను మెప్పించడం మా మొదటి విజయంగా భావిస్తున్నాం అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు, త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్: శ‌్రీనివాస్ నాయుడు గ‌ల‌భా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.ఎస్‌.చ‌క్ర‌వ‌ర్తి, కో ప్రొడ్యూస‌ర్‌: క‌ట‌కం వాసు, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, సాయికిర‌ణ్‌, సంగీతం: యోగీశ్వ‌ర శ‌ర్మ‌, ఎడిట‌ర్‌: పైడి బ‌స్వ రెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌: టి.సురేంద‌ర్ రెడ్డి, డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ నిర్మాత‌లు: ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కార్తికేయ‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X